వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు.. నా అమ్మ మొగుడంటూ తెలంగాణలో అధికారం కోసం ఎగబడితే… అంటూ సీఎం కేసీఆర్ గత ఆరేళ్ల నుంచి ఓటమి ఎరుగని ధీరుడిగా చరిత్రకెక్కారు. కానీ.. పరిస్థితులు మారాయి. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వినిపిస్తున్నాయి. 2014 నుంచి 2018 వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణను ఏలింది టీఆర్ఎస్ పార్టీ. కానీ.. 2018 లో గెలిచాక… టీఆర్ఎస్ కు దెబ్బలు తాకడం మొదలుపెట్టాయి.
కాకపోతే.. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. వాటికి అనుగుణంగా ఎన్నికల్లో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని.. ఎలాగోలా గట్టెక్కుతూ వస్తున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు.. ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు.. మరేదో కావచ్చు. ఎన్నిక ఏదైనా.. ఆ ఎన్నికలను తన రాజకీయ అనుభవంతో తన బుట్టలో వేసేసుకుంటున్నారు కేసీఆర్.
అలాగే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయదుందుబి మోగిస్తుందనుకున్నారు. కానీ.. సీన్ మొత్తం రివర్స్ అయింది. టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ పడింది. కానీ.. ఆ దెబ్బ తీసింది.. ప్రతిపక్ష పార్టీలో.. ఇంకెవరో కాదు. వరుణుడు టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బేశాడు. హైదరాబాద్ ను ముంచెత్తాడు. దీంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ గ్రాఫ్ ఉప్ అంటూ పడిపోయింది.
తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్టేట్. ప్రపంచంలోనే ద బెస్ట్ మెట్రో సిటీ హైదరాబాద్.. అంటూ డప్పులు కొట్టిన టీఆర్ఎస్ పార్టీకి.. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఏదో తాత్కాలికంగా వరద బాధితులను ఆదుకున్నప్పటికీ.. హైదరాబాద్ ప్రజల్లో మాత్రం టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.
వరదలనంటే ఆపలేకపోయారు. కనీసం వరద సాయం అయినా సరిగ్గా ఇవ్వలేకపోయారని ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీకి మరో తలనొప్పి స్టార్ట్ అయింది. ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తే… టీఆర్ఎస్ పార్టీ ఘోరాతిఘోరంగా ఓడిపోయే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులే భావిస్తున్నారట. ఆ విషయాన్నే సీఎం కేసీఆర్ కు కూడా చెబుతున్నారట. దీంతో ఈ సమయంలో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించడం కంటే.. వాయిదా వేయడమే బెటర్ అని ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్ పరిస్థితులు సెట్ అవ్వాలంటే ఇంకాస్త సమయం పడుతుంది. పరిస్థితులన్నీ కుదుట పడేదాక ఎన్నికలను వాయిదా వేయగలిగితే చాలు.. అనే అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలు వెలిబుచ్చుతున్నారు. అయితే.. ఈ అవకాశాన్ని తమవైపునకు తిప్పుకొని గ్రేటర్ లో పాగా వేయాలనేది ప్రతిపక్ష పార్టీల ప్లాన్. ఎలాగైనా ఈ సమయంలోనే గ్రేటర్ ఎన్నికలు జరిగేలా చూడాలని ఈసీని కోరుతున్నాయట. ఈ సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోతుందని ప్రతిపక్షపార్టీలకు కూడా తెలియడంతో… ఇప్పుడెలా.. అని టీఆర్ఎస్ అధిష్థానం ఆలోచిస్తోందట. చూద్దాం మరి.. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయా? లేక వాయిదా పడుతాయా?