తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు శుభవార్త తెలిపారు. వచ్చే వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు నిధులను విడుదల చేయడానికి ప్రకటించారు. ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేయాలని అన్నారు. ఇక ఈ విషయం గురించి తాజాగా సోమేశ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతి పంటకు ఎలాగైతే రైతుబంధు నిధులు విడుదల చేస్తామో.. అదే తరహాలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలి అని తెలిపారు. ఇక ఈ నెల 28 నుంచి సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని అన్నారు. తక్కువ నుంచి ఎక్కువకు లబ్ధిదారుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేయనున్నారు.