తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని వెల్లడించడం వెనుక మరో ప్లాన్ ఉందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ చెబుతున్న విషయాలకు చేస్తున్న విషయాలకు పొంతనే లేదని ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ మాట మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ ఇతర పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తూ ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలకు పది నెలలు మాత్రమే ఉందని కేసీఆర్ చేసిన కామెంట్ల నేపథ్యంలో ఈ కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కామెంట్లు పార్టీ నేతలకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ ప్రస్తుతం సైలెంట్ అయినా జాతీయ పార్టీకి సంబంధించి తెరవెనుక అడుగులు పడుతున్నాయి.
బీ.ఆర్.ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను మించిన మేనిఫెస్టోతో కేసీఆర్ అడుగులు వేయనున్నారని బోగట్టా. తన మేనిఫెస్టో ద్వారానే దేశంలోని ప్రజలు తన వైపు దృష్టి పెట్టే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఇతర రాజకీయ నేతలకు భిన్నంగా అడుగులు వేస్తూ రాజకీయాల్లో గెలుపు కోసం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా గెలుపు కోసం సరైన దారిలో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తెలంగాణలో తెరాస కచ్చితంగా అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ పర్ఫెక్త్ గా ప్లాన్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.