ఆరోజు కోసం ఎదురుచూస్తున్న కేసీఆర్.. జగన్‌ని అడ్డంగా బుక్ చేయడం కోసం 

Krishna Godavari
రెందు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో వివాదం నడుస్తోంది.  అసలు తాము స్నేహం చేస్తున్నదే జల వివాదాల పరిష్కారం కోసమని చెప్పిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఏడాది తిరగకుండానే గొడవపడుతుండాటంతో సమస్య పరిష్కారం ఎలాగోననే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.  ఏపీ ప్రభుత్వం తమకు జరిగిన కేటాయింపుల మేరకే శ్రీశైలం ఎగువన ప్రాజెక్ట్ కట్టి రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకెళ్లాలని అనుకున్నట్టు చెబుతుండగా తెలంగాణ సర్కార్ మాత్రం శ్రీశైలం ఎగువన ప్రాజెక్ట్ కడితే తెలంగాణ జిల్లాలు కొన్ని పూర్తిగా ఎండిపోతాయని అంటున్నారు.  కేసీఆర్ అయితే ఎక్కడైనా స్నేహం కానీ నీటి విషయంలో కాదని తేల్చి చెప్పేశారు. 
Krishna Godavari
 
రెండు ప్రభుత్వాలు రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వద్ద పిర్యాధు చేయడంతో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.  ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలవనరుల మంత్రి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ముందుగా ఈ సమావేశాన్ని ఆగష్టు 5న జరపాలని అనుకున్నా తర్వాత ఆగష్టు 25కు మార్చారు.  ఈ సమావేశంలో కౌన్సిల్ ముందు ఇరు ప్రభుత్వాలు తమ తమ వాదనలు వినిపిస్తాయి.  ఎవరి వాదనలో న్యాయం ఉందని అనిపిస్తే వారికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి. 
 
అందుకే ఈ సమావేశాన్ని ఇరు ముఖ్యమంత్రులు చాలా సీరియల్ గా తీసుకున్నారు.  అయితే మొదటి నుండి ఈ వివాదాన్ని పరిశీలిస్తే కేసీఆర్ ప్రభుత్వం వాదనే బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది.  శ్రీశైలం ఎగువన ప్రాజెక్ట్ కడితే ఇన్ ఫ్లో తగ్గి శ్రీశైలం ద్వారా నీరు అందుకుంటున్న తెలంగాణ జిల్లాలు కొన్నింటికి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం కాళేశ్వరం సహా తెలంగాణ సర్కార్ కడుతున్న అన్ని ప్రాజెక్టులు కొత్తవని, అన్నీ అక్రమమైనవే అని అంటున్నదే తప్ప ఎక్కడా ఆధారాలు చూపలేకపోతోంది.  కేసీఆర్ మాత్రం ప్రాజెక్టులన్నీ పాతవేనని, రాష్ట్రం విడిపోయాల రీడిజైన్ చేశామని అంటూ నీటి కేటాయింపులు, భూసేకరణ, నిధుల విడుదల, నిధుల వినియోగం లాంటి అన్ని ఆధారాలను పక్కాగా సిద్దం చేసుకుంటున్నారు.  సమావేశానికి కేసీఆర్ సన్నద్దమవుతున్న తీరు చూస్తే ఆగష్టు 25న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిబంధనలకు విరుద్దమని నిరూపించి జగన్‌ను కౌన్సిల్ ముందు అడ్డంగా బుక్ చేస్తారా అనే అనుమానం కలుగుతోంది.