తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు తాను చెప్పిన పంటలే వేయాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఏ సీజన్ లో ఏ పంట వేస్తే లాభాలు వస్తాయి? ఏ పంట వేస్తే వ్యయ, ఆధాయాలు ఎలా ఉంటాయి? రైతులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వృద్ది సాధించలంటే? చేయాల్సింది ఏంటి? అంటూ కొన్ని మార్గదర్శకాలు చేసిన సంగతి తెలిసిందే. తాను చెప్పింది చెయకపోతే రైతుబంధు ఇవ్వనని నిర్మొహమాటంగా చెప్పేసారు. రైతులకు వ్యవసాయం ఎలా చేయాలో తెలియకే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని తనదైన శైలిలో చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు కేసీఆర్ రైతు బిడ్డా అంటూ ఎద్దేవా చేసారు.
కేసీఆర్ రైతు ఫ్యామిలీ నుంచి వచ్చి సీఎం అయ్యారు గా! అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించారు. తాజాగా ప్రతిపక్షం మరోసారి కేసీఆర్ తీరును తప్పుబట్టింది. ఆ పంటలకు చీడపీడలు పట్టకుండా ఎలా వ్యవహరించాలో? పంటను పురుగు నుంచి ఎలా కాపాడుకోవాలో చెప్పాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేసారు. మిడతల దాడి నుంచి కూడా ఇతర రాష్ర్టాలు పంటలను ఎలా కాపాడుకోవాలో అక్కడి రైతులకి కూడా దశా దిశానిర్ధేశం చేస్తే బాగుంటుందని సెటైరికల్ గా స్పందించారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ ఎలా ఒణికిస్తుందో? భారత సరిహద్దులోని పంటలపై మిడతలు పెద్ద ఎత్తున దాడిచేస్తున్న సంగతి తెలిసిందే.
కొన్ని నెలల క్రితం రాజాస్థాన్ లోని పంటలను మిడతలు పెద్ద ఎత్తున నాశనం చేసాయి. దేశ వ్యాప్తంగా ఆ ఘటన సంచలనం రేపింది. మిడతల వేగం చూసి ప్రజల మీద ఎక్కడ దాడి చేస్తాయో అన్నంతంగా రాజస్థాన్ వాసులు బయపట్టారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ శివారులో ఏకంగా మూడు కిలోమీటర్ల మేర మిడతల దండు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆ ప్రాంత రైతులను రాష్ట్ర వ్యవసాయ విభాగం అధికారులు అప్రమత్తం చేశారు. మిడతలను తరిమి కొట్టేందుకు పెద్దగా శబ్దాలు చేయాలని రైతులకు సూచించారు. ట్రాక్టర్లు, అగ్నిమాపక యంత్రాల సహాయంతో మిడతల తాకిడి ఉన్న ప్రాంతాల్లో రసాయనాలను పిచికారి చేయనున్నట్లు తెలిపారు అధికారులు. ఈ సన్నివేశాలను ఉదహరించే తెలంగాణ సీఎంపై ప్రతిపక్షం సెటైర్లు వేసినట్లుంది. అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ కొన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో భేటి అయిన సంగతి తెలిసిందే.