కేసీఆర్ : తెలంగాణ జోలికి రాకుండా ఆంధ్రకి బుద్ది చెప్పాలి

Kcr vs Jagan Telugu Rajyam

  తెలుగు రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్య పెరిగి పెరిగి పెద్దది అయ్యింది. న్యాయ ప్రకారం మాకు రావాల్సిన నీటినే మేము తీసుకుంటున్నామని ఆంధ్ర ప్రదేశ్ చెపుతుంటే, లేదు తెలంగాణ జలాలను కూడా ఆంధ్ర తీసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. దీనితో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరిపాకాన పడింది.

Kcr vs Jagan Telugu Rajyam

 

   కేంద్రం ఈ నెల ఆరో తేదీన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహిస్తుంది. దీనికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అద్యక్షతన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా హాజరై తమ తమ వాదనలను వినిపించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా అక్కడ అనుసరించవలసిన వ్యూహంపై కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసాడు. పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అపెక్స్ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని,మళ్ళీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండ బద్దలు కొట్టినట్లు సృష్టం చేయాలనీ ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పటం జరిగింది. దీనిపై సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలంగాణ ప్రజల హక్కులను హరించటానికి జరుగుతున్నా కుట్రలను ఎదుర్కోవాలని,నిజానిజాలు యావత్తు దేశానికీ తెలియాలని, అపెక్స్ మీటింగ్ అని చెపుతూ కేంద్రం చేయాల్సిన పని సరిగ్గా చేయటం లేదని, కేంద్రం తీరును గట్టిగా ఎండగట్టాలని, నీటి కేటాయింపుల విషయంలో సృష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఇదే సమావేశంలో పట్టుపట్టాలని కెసిఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

  మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా అపెక్స్ మీటింగ్ కి సిద్ధం అవుతున్నాడు. తామేమి అన్యాయంగా నీటిని తీసుకోవటం లేదని, న్యాయంగా తమకి రావాల్సిన వాటాలో మాత్రం నీటిని తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం అనవసరమైన వివాదాలను సృష్టిస్తుందని బలంగా వాదనలను వినిపించడానికి సర్వం సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 6 న జరగబోయే ఈ అపెక్స్ కమిటీ మీటింగ్ మీద ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా దృష్టి సారించి ఉన్నారు .. ఎవరి వాదన నెగ్గుతుందో, ఎవరు న్యాయంగా వెళ్తున్నారో, ఎవరు అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలిసే అవకాశం వుంది. అదే సమయంలో ఇందులో నైతిక విజయం అనేది ఇరు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రతిష్టను పెంచుతుంది. అందుకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం అవుతున్నాయి