కరోనా వైరస్ వేళ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. కష్టకాలంలో కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సిన సమయంలో అలాంటి పనులు మానేసి పాత సచివాలయం కూల్చేసి కొత్త సచివాలయం శంకుస్థాపనకు ముహూర్తాలు చూస్తున్నారంటూ వామపక్షాలు దుమ్మెత్తిపోస్తు న్నాయి. సచివాలయం నిర్మాణాకి 500 కోట్లు కేటాయించడంపై ప్రజలపై కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ది ఏంటో? అద్ధం పడుతుందని మండిపడుతున్నాయి. వర్షాలు వస్తే ఆసుపత్రి మంచాల క్రింద నుంచి పారే ఉస్మానియా ఆసుపత్రి వరద నీరు గురించి చెప్పాల్సిన పనిలేదు.
కోవిడ్ ఆసుపత్రిగా మారిన ఉస్మానియాలో అక్కడ వైద్యం ఏస్థాయిలో అందుతుందో చెప్పాల్సిన పనిలేదు. కరోనా రోగమని ఉస్మానియాకి వెళ్తే..కైలాశానికి వెళ్లినట్లేనని మొన్నటి సన్నివేశంతో తేలిపోయింది. తాజాగా కేసీఆర్ కరోనా వేళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే? ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్ధులకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టడం. విద్యార్ధులు లంచ్ అవర్ లో భోజనాలకని ఇంటికి వెళ్లి మళ్లీ తిరిగి రావడం లేదుట. దీనివల్ల కాలీజీల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయట. అందుకే బంగారు తెలంగాణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారుట. ఇలా చేయడం వల్ల కాలేజీల్లో చదువుకునే పిల్లల సంఖ్య పెరుగుతందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో అన్ని స్కూళ్లు, కాలేజీలు మూసేసారు. ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియదు. అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు కరోనాతో పోరాటం చేస్తున్నాయి. దీనిలో భాగంగా కొవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, పీపీఈ కిట్లు అమర్చుకోవడం వంటి పనుల్లో తలమనుకలై ఉన్నాయి. కేసీఆర్ మాత్రం అవేమి పట్టించుకోకుండా కాలేజీలు లేని వేళ మధ్నాహ్నం పూట భోజనాలు పెడతామంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. కరోనా సమయంలో వైరస్ గురించి పట్టించుకోకుండా రాష్ర్టాన్ని దోచుకునే పథకాలు ప్రవేశ పెడుతున్నారని మండిపడుతున్నాయి.