సర్వేల్లో షాకింగ్ నిజాలు.. అందుకే కేసీఆర్ ఈ స్టెప్ వేశారా ?

తెలంగాణ సీమే కేసీఆర్ రాజకీయంగా ఏ అడుగు వేసినా దాని వెనుక ఒక అధ్యనం, బలమైన కారణం ఉంటాయి.  భవిష్యత్తులో ఎంతో ప్రయోజనం ఉంటుంది అనుకుంటే తప్ప కీలకమైన పొలిటికల్ ప్లాన్స్ మార్చరాయన.  తాజాగా కేసీఆర్ వ్యవహారశైలి చూస్తుంటే ప్రత్యర్థి పార్టీలను చూసే ఆయన విధానంలో స్పష్టమైన మాపు కనబడుతోంది.  ఇన్నాళ్లు తెరాసకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది.  బీజేపీ ఉన్నా దానికి రెండో స్థానమే ఇచ్ఛేవారు.  కేసీఆర్ నోటివెంట విమర్శా అంటూ వస్తే అది కాంగ్రెస్ పార్టీ గురించే ఉండేది.  అయితే ఈమధ్య అయన మాటల్లో, చేతల్లో కాంగ్రెస్ పార్టీ మీద కంటే బీజేపీ మీద ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. 

KCR changes his target in GHMC elections
KCR changes his target in GHMC elections

ఇందుకు కారణం సర్వేలేనట.  ఏ ఎన్నికలైనా ముందుగా సర్వేలు చేయించడం కేసీఆర్ అలవాటు.  తనకు ఎంతో నమ్మకమైన సంస్థల ద్వారా సర్వేలు చేయించే గులాబీ దళపతి ఆ సర్వేల ఫలితాల ఆధారంగా ఎన్నికల ప్లానింగ్ చేసుకునేవారు.  ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే చేసుకుని ఖచ్చితమైన ఫలితాలను  సాధించుకునేవారు.  అలా త్వరలో జరగనున్న గ్రేట్క్ర్ ఎన్నికల కోసం సర్వేలు చేయించారు.  ఆ సర్వేల్లో తెరాసకు 100 స్థానాలు ఖాయమనే ఫలితాలు   వచ్చాయని కేసీఆరే స్వయంగా వెల్లడించారు.  అలాగే కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగవుతుంది, బీజేపీ కొంత పుంజుకుంటుందని అన్నారు. 

అయితే బీజేపీ పుంజుకోవడం కొంచెం స్థాయిలో కాదని బాగానే పుంజుకుంటుందని తేలినట్టు చెప్పుకుంటున్నారు.  అందుకే కేసీఆర్ తమ దృష్టి మొత్తం బీజేపీ మీదే పెట్టారట.  ఇన్నాళ్లు మోదీ విధానాలను పొగుడుతూ వచ్చిన ఆయన ఉన్నట్టయింది రివర్స్ కావడానికి విద్యుత్ బిల్లు, వ్యవసాయ బిల్లు లాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకించడానికి కూడ సర్వ్ ఫలితాలే ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు.  జాతీయ స్థాయిలో బీజేపీ మీద విమర్శలు గుప్పిస్తే రాష్ట్రంలో ఉన్న బీజేపీ మీద వ్యతిరేకత మొదలవుతుందని, తద్వారా ఎన్నికల్లో వారి వ్యతిరేక ఓట్లను కూడా తామే పొందవచ్చనేది కేసీఆర్ ప్లాన్ అని చెప్పుకుంటున్నారు.  అంతే కదా మొక్కగా ఉన్నప్పుడే తుంచడం వీలవుతుంది కానీ మానైతే వంచలేరు కదా.