రాజకీయాల్లో కేసీయార్ వెలుగులు తగ్గుతున్నాయ్. తెలంగాణలో ఒకప్పుడు కేసీయార్ అంటే ఓ స్టార్ పొలిటీషియన్. ఇప్పటికే అదే ఇమేజ్ ఆయనకి వుందా.? అంటే, లేదనే చెప్పాలేమో. గతంలో అయితే, కేసీయార్ మీద ఎవరన్నా విమర్శలు చేస్తే, తెలంగాణ సమాజం నుంచి స్పందన గట్టిగా వచ్చేది. ఇప్పుడెవరూ పట్టించుకోవడంలేదు.. కేసీయార్‌ని ఎవరెంతలా విమర్శించినా.
అసెంబ్లీ సాక్షిగా కేసీయార్ ‘రాజీనామా సవాల్’ విసిరారు. కేంద్రంపై నిప్పులు చెరగడం కేసీయార్‌కి కొత్తేమీ కాదు. ఇప్పుడూ కేసీయార్ చేసింది అదే. విద్యుత్ రంగంలో సంస్కరణలంటూ కేంద్రం తెరపైకి తెచ్చిన ఓ ప్రతిపాదన (వ్యవసాయ మీటర్లు) కేసీయార్‌కి నచ్చలేదు. దాన్ని మెయిన్ ఎజెండాగా చేసుకుని బీజేపీ మీదా, కేంద్రం మీదా విమర్శలు చేస్తున్నారు కేసీయార్.
‘నేను బతికుండగా మీటర్లు పెట్టనివ్వను..’ అని కేసీయార్ అంటోంటే, ఆయనకు మద్దతుగా తెలంగాణ సమాజం అస్సలు కదలడంలేదు. దీన్నొక రాజకీయ డ్రామాగానే తెలంగాణ సమాజం చూస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? కానీ, కేసీయార్ వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఆ వ్యవహారంతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారాయన.
‘చేస్తే, చెయ్.. ఎవడు నిన్ను ఆ పదవిలో కూర్చోమన్నాడు.?’ అంటూ బీజేపీ, కేసీయార్ మీద సెటైర్లు వేస్తోంది. ‘ఇప్పుడు గనుక ముందస్తు ఎన్నికలకు వెళితే, ఇప్పటికిప్పుడు తెలంగాణకు నీ పీడ వదిలిపోతుంది..’ అంటూ బీజేపీ నేతలు, కేసీయార్ మీద చేస్తున్న వ్యాఖ్యలతో కూడా తెలంగాణ సమాజంలో కదలిక రావడంలేదు.
నిజానికి, హీట్ ఏమాత్రం వున్నా.. కేసీయార్, ముందస్తు ఎన్నికల గురించి ఆలోచించేవారే. పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు గనకనే.. కేసీయార్ కూడా కంగారు పడుతున్నారు.