ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కవిత మెగా ప్లాన్: విజయం ఖాయం !

kavitha mega plan for mlc elections
kavitha mega plan for mlc elections
kavitha mega plan for mlc elections

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు మ‌రో 9 రోజుల స‌మ‌యం ఉండ‌డంతో జోరుగా వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. గత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌విత ఓట‌మి పాల‌య్యారు.. ఆలాంటి ప‌లితం పునరావృత్తం కాకుండా సీఎం కేసీఆర్ మెప్పు పొందేందుకు నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా నేత‌లు వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్‌ను తాజాగా ఈ రోజు మ‌రో బీజేపీ కార్పోరేట‌ర్ ను కారెక్కించారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి ఉన్న ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు ఇప్పటికే కారెక్కారు. మరికొంత మంది ప్రజాప్రతినిధులు కారెక్కెందుకు క్యూలో ఉన్నారు. టీఆర్ఎస్‌కు ఇప్పటికే పూర్తి ఆధిక్యత ఉన్నా వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. మొత్తం 824 మంది ప్రజా ప్రతినిధులలో 75 శాతం టీఆర్ఎస్‌కు చెందన వారే ఉన్నారు. అయినా బీజేపీ నేతలే ల‌క్ష్యంగా కారు దూసుకు పోతుంది. అధికార పార్టీ నేతల ఎత్తులతో ఇతర పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారి ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో మాజీ ఎంపీ క‌విత గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్‌ 9న నిర్వహించేందుకు స‌ర్వ సిద్దం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కేంద్రాలను పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు గతంలో నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 నేపథ్యంలో 50 కేంద్రాలు పెంచాలని జిల్లా అధికారులు నివేదిక పంపారు. ఆ ప్రతిపాదనకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది