Kavitha: తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీలో అలజడి నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా బిఆర్ఎస్ పార్టీలో కవితకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె ఒక లేఖ ద్వారా చెప్పకనే చెప్పేసారు. కవిత తన తండ్రికి పార్టీ గురించి రాసినటువంటి ఒక లేఖ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో పార్టీలో ఏదో విభేదాలు చోటు చేసుకున్నాయని పార్టీలో కవిత కొనసాగడాన్ని కొందరు సహించలేకపోతున్నారని స్పష్టమైనది.
ఈ క్రమంలోనే కవిత మరో పార్టీ పెట్టబోతున్నారని అతి త్వరలోనే ఈమె కొత్త పార్టీ గురించి ప్రకటన కూడా రాబోతుంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే కవిత ఆ లెటర్ గురించి సరికొత్త డిమాండ్ చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తప్ప సరైన నాయకుడు ఎవరూ లేరు అంటూ పరోక్షంగా కేటీఆర్ అలాగే హరీష్ రావును కూడా ఉద్దేశించి ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ లాగే నాకు కూడా తిక్క ఉందని నేను ఎవరికి భయపడనని తెలిపారు.
నేను నా తండ్రికి లెటర్ రాయడం ఇది మొదటిసారి కాదు 25 సంవత్సరాల నుంచి ఇలా నేను నాన్నకు లెటర్ రాస్తున్నాను. అయితే ప్రతిసారి నాన్న ఆ లెటర్ చదివి చించేసేవారు. కానీ ఈసారి మాత్రం ఆ లెటర్ బయటకు వచ్చింది. అది ఎలా వచ్చింది? ఎవరు లీక్ చేశారనే విషయం తెలియచేయాలని తాను డిమాండ్ చేస్తున్నానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈమె తన సోదరుడు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చారు. తన తండ్రికి రాసిన లెటర్ బయట పెట్టే ఛాన్స్ తన సోదరుడు కేటీఆర్ కి మాత్రమే ఉందని భావిస్తున్నారు. ఇక కేటీఆర్ కూడా కవిత రాసిన లెటర్ పై నెగిటివ్ గానే స్పందిస్తూ కామెంట్లు చేయడంతో వీరిద్దరి మధ్య వ్యవహారం తారాస్థాయికి చేరిందని తెలుస్తోంది.