Katrina Kaif- Vicky Kaushal: కత్రినా కైఫ్ పెళ్లి వేడుకలకు హాజరైన సినీ స్టార్స్ వీళ్లే..!

Katrina Kaif- Vicky Kaushal: బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ నేడు మధ్యాహ్నం మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. గత కొద్ది రోజుల నుంచి వీరి పెళ్లి వార్తలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె పెళ్లికి సంబంధించి ప్రతి చిన్న విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె పెళ్లికి ఎవరెవరు వస్తున్నారు ఎవరూ రావడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇకపోతే కత్రినా విక్కీ కౌశల్ పెళ్లి విషయం 19 గురువారం మధ్యాహ్నం ఎంతో అంగరంగ వైభవంగా మూడుముళ్ల బంధంతో వీరిద్దరూ ఒకటయ్యారు.

ఈమె పెళ్లి రాజస్థాన్లోని హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ లో ఎంతో ఘనంగా జరిగింది.ఈమె వివాహ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్ తదితర తారలతోపాటు, క్రికెటర్‌ విరాట్-అనుష్కతో ఈ వివాహానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈమె వివాహానికి హాజరైన అతిథులకు సెక్యూరిటీ కార్డు లేకుండా ఎంట్రీ లేదని తెలుస్తోంది.

ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు సమక్షంలో కత్రినాకైఫ్ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రముఖుల పెళ్లి వీడియోలు ఫుటేజీలో ఏదైనా మ్యాగజైన్లకు ఇవ్వడం ప్రస్తుతకాలంలో ట్రెండ్ అవుతుంది. ఇలా కత్రినా కైఫ్ పెళ్లి వేడుకలను కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా వంద కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకోసమే ఈమె పెళ్లి వేడుకల్లో ఎటువంటి ఫోటోలు, వీడియోలకు అనుమతి లేదని వెల్లడించారు.