Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కౌశల్ డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి ఈ జంట సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉండి డిసెంబర్ 9న వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇలా ఈ ముద్దుగుమ్మ పంజాబీ ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది.
ఇక మన సాంప్రదాయాల ప్రకారం కొత్త కోడలు అత్తవారింట అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏదైనా తీపి పదార్థం చేయడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీని కత్రినాకైఫ్ కూడా శ్రద్ధగా పాటించినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే పంజాబీ కోడలిగా విక్కీ కౌశల్ ఇంట అడుగుపెట్టిన కత్రినాకైఫ్ మొట్టమొదటిసారిగా హల్వా వండినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను చేసిన హల్వాను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ మైనే బనాయా(నేను చేశాను)అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం ఈ హల్వా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ ఫోటోని చూసి తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సందర్భంగా కొందరు కత్రినాకైఫ్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒక కోడలిగా తన బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది అంటూ ఆమె పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హల్వా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.