Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ డిసెంబర్ 9వ తేదీన అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఐతే పెళ్లి బంధంతో ఆ వార్తలకు ముగింపు పలికారు. ఈ సందర్భంగా కత్రినాకైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. కత్రినాకైఫ్ లండన్ లో పుట్టి పెరగడం వల్ల ఈమె ఇంగ్లీష్ ఎంతో అద్భుతంగా మాట్లాడగలుగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో సార్లు మీడియా ముందుకు వచ్చిన కత్రినా ఎప్పుడు ఇంగ్లీషులోనే మాట్లాడేది.
బాలీవుడ్ చిత్రాలలో నటించడం వల్ల హిందీ నేర్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఇప్పుడు పంజాబీ కూడా నేర్చుకున్నట్లు తెలుస్తోంది. కత్రినాకైఫ్ పంజాబీ నేర్చుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఈమె భర్త విక్కీ కౌశల్ పంజాబీ వ్యక్తి కావడంతో ఆయన మాతృభాష పంజాబీ. ఇక ప్రతిరోజు తనతో మాట్లాడాలన్న తన కుటుంబ సభ్యులతో కలిసి గడపాలన్న తప్పకుండా తన పంజాబీ నేర్చుకోవాలని భావించి ఎంతో కష్టపడి ఈ భాష నేర్చుకుంది.
ఇదే విషయాన్ని విక్కీ కౌశల్ కజిన్ సిస్టర్ డాక్టర్ ఉపాసనా వోహ్రా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి వేడుకలో మూడు రోజుల పాటు కత్రినాకైఫ్ ఒక ఇంగ్లీష్ ముక్క కూడా మాట్లాడలేదని పూర్తిగా పంజాబీ భాష మాట్లాడుతూ తను మా కుటుంబ సభ్యులతో ఎంతో బాగా కలిసిపోయిందని ఈ సందర్భంగా డాక్టర్ ఉపాసన ఈ సందర్భంగా వెల్లడించారు.ప్రస్తుతం కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.