Katrina Kaif: పెళ్లి తర్వాత ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ మార్చిన కత్రినా.. ఏం పెట్టారో తెలుసా?

Katrina Kaif: గత కొద్దిరోజుల నుంచి రహస్యంగా తన ప్రియుడు విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడుపుతున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ డిసెంబర్ 9 వ తేదీ తన ప్రియుడిని పెళ్లాడిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఫోటోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉంటూ మీడియా ఎదుట ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న ఈ జంట వివాహం తర్వాత జంటగా మీడియా ముందు దర్శనమిస్తున్నారు.

సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే కత్రినాకైఫ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో కత్రినా చాలా రోజుల తర్వాత ప్రొఫైల్ ఫోటో మార్చారు. ఇంతకీ ఈమె ఎలాంటి ప్రొఫైల్ అప్డేట్ చేశారు అనే విషయానికి వస్తే…వివాహ సమయంలో కత్రినాకైఫ్ కౌశల్ ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా సూర్యాస్తమయ సమయంలో ఈ ఫోటోని క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో కత్రినా కైఫ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండ్స్ లో అప్డేట్ చేశారు.

ప్రస్తుతం ఈ ప్రొఫైల్ ఫోటో చూసి ఎంతో మంది ఈ ఫోటోకి ఫిదా అవుతూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి అయిన తర్వాత కత్రినా కైఫ్ అత్తవారి ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలిగా మొట్టమొదటిసారి హల్వా చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈ విషయంపై స్పందించి ఎంతటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినప్పటికీ తన చేయాల్సిన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.