Katrina Kaif: వామ్మో ఆ చీర కోసం 40 మంది కళాకారులు 18 గంటలు శ్రమ పడ్డారా!

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కొంతకాలం నుంచి ప్రేమలో ఉంటూ ఎట్టకేలకు డిసెంబర్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంట పెళ్లి గురించి వీరి వస్త్రధారణ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా కత్రినా కైఫ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ ఫోటోలో కత్రినా వేసుకున్న డ్రెస్ గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఈ ఫోటోలలో కత్రినా ధరించిన డిజైనర్ శారీ పొడవాటి పైట కొంగుతో రాజసం చిందిస్తూ దర్శనమిచ్చింది. ఈ చీరను డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేశారు. కత్రీనా తల్లి తాలూకూ బ్రిటీష్ వారసత్వానికి ప్రతీకగా ‘వింటేజ్ ఇన్‌స్పైర్డ్ కౌచర్ శారీ‘ని రూపొందించానని సబ్యసాచి చెప్పారు. కత్రినా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసమని ఈ చీరను ప్రత్యేకంగా తయారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కత్రినాకైఫ్ కట్టుకున్న ఈ చీర అద్భుతమైన డిజైన్ తో రూపొంది ఉండడంతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ చీర కోసం ఏకంగా 40 మంది కళాకారులు ఏకంగా 18 గంటల పాటు శ్రమించినట్లు సమాచారం. ఇంత మంది గంటలపాటు కష్టపడటంతో ఎంతో అద్భుతమైన ఈ చీర రూపొందిందని డిజైన్ చేసి ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ శారీ లోని ఫ్రీ షూట్ వెడ్డింగ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.