జబర్దస్త్ లో సందడి చేసిన వంటలక్క కూతుర్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో అందరికీ తెలిసిన విషయమే. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ కామెడీ షో పరిస్థితి ప్రస్తుతం కొంచం దారుణంగా తయారైంది. ఈ షోస్ కి మూల స్తంభాలా ఉన్న ఆది, సుధీర్, గెటప్ శ్రీను వంటి ప్రముఖ కమెడియన్లు ఈ షో నుండి బయటకు వెళ్లిపోయారు. దీంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ జబర్దస్త్ షో ని మాత్రం నిర్విఘ్నంగా ప్రసారం చేస్తూనే ఉన్నారు.

ఈ షో ఇప్పుడూ కొత్త టీమ్ లీడర్లు వచ్చారు. అంతేకాకుండా రోజా గారు మంత్రి పదవి దక్కటంతో జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. ఆ స్థానంలో ప్రముఖ నటి ఇంద్రజ ఇప్పుడు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అయితే గ్లామరస్ యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ నుండి వెళ్ళిపోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో లో రాకెట్ రాఘవ , చలాకి చంటి, తాగుబోతు రమేష్ తమ స్కిట్ తో సందడి చేశారు. ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ లో కార్తీకదీపం సీరియల్ లో అలరించిన హిమా, సౌర్య సందడి చేశారు.

వీరిద్దరూ మహరాణుల లాగా చాలా హుందాగా ఎంట్రీ ఇచ్చారు. ఇక స్టేజి మీదకి వచ్చి రావటంతోనే శౌర్య అనసూయపై పంచ్‌లు వేసేసింది . పక్క రాజ్యపు మహరాణి అనసూయ ఎలా ఉంది.. ఆమె ఏమైనా చేస్తున్నారా? ఖాళీగానే ఉన్నారా? అని పంచ్ వేసింది. అప్పుడు నూకరాజు నూకరాజు.. ఆమె ఖాళీగా ఉండటం ఏంటి తల్లీ.. మన రాజ్యంలో కామెడీ షో చేస్తూ పక్క రాజ్యంలో ప్రోగ్రామ్‌ చేస్తూ.. రాత్రి ఈవెంట్ చేస్తూ పొద్దున్న ఐదింటికి రెస్ట్ తీసుకుంటున్నారు అంటూ అనసూయ బిజీ షెడ్యూల్ చెప్పుకొచ్చాడు. ఈ వారం వీరిద్దరూ జబర్దస్త్ ఫుల్ సందడి చేయనున్నారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.

Jabardasth Latest Promo - 14th July 2022 - Anasuya,Chalaki Chanti, Rocket Raghava - Mallemalatv