ఆ కోర్టు.. ఏకంగా ముఖ్యమంత్రికే ఫైన్ విధించింది. వావ్.. నిజంగా ఇది కదా అసలైన న్యాయం అంటే. ఎవరైనా సరే.. చట్టం ముందు సమానమే అనే విషయం దీనితో నిరూపితం అయింది. ఇంతకీ ఎక్కడ ఇది జరిగింది అంటారా? మన పక్క రాష్ట్రం కర్ణాటకలోనే. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అక్కడి హైకోర్టు 25 వేల రూపాయల జరిమానాను విధించింది.
బెంగళూరు దగ్గర్లో ఉన్న గంగేనహళ్లి అనే ప్రాంతంలో ఉన్న 1.1 ఎకరాల భూమి వల్ల సీఎం లబ్ధి పొందారంటూ 2015 లో కేసు నమోదు అయితే.. ఆ కేసు విచారణ ఇంకా సాగుతూనే ఉన్నది.
అయితే.. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు జరగకుండా… యడ్యూరప్ప పిటిషన్ వేశారని.. అందుకే దాన్ని విచారించి సీఎంకు జరిమానా విధిస్తున్నట్టు జస్టిస్ కున్హా వెల్లడించారు.
అలాగే.. ముఖ్యమంత్రిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కూడా కోర్టు కొట్టేయలేదు. సోషల్ యాక్టివిస్ట్ జయకుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్ లో మాజీ సీఎం కుమారస్వామి పేరును కూడా చేర్చారు. కుమారస్వామి కూడా లబ్ధి పొందారంటూ జయకుమార్ పిటిషన్ దాఖలు చేశారు.