Car Accident: అతి వేగం వల్ల కరీంనగర్ లో నలురి ప్రాణాలు బలి తీసుకున్న కారు..!

Car Accident: ప్రతిరోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరి వ్యక్తుల నిర్లక్ష్యం, అతి వేగం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాల గురించి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, కొందరి వ్యక్తులు భాద్యతగా లేకపోవటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్ జిల్లా కమాన్ వద్ద ఘోర ప్రమాదం జరిగి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

కమాన్ వద్ద అతి వేగం వల్ల కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కొలిమి పనులు చేసుకుంటున్న వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటన వల్ల ఫరియద్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, ముగ్గురు మహిళలు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించారు. కారు అతి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురు యువకులు అక్కడి నుండి పారిపోయారు. కమాన్ ఏరియాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి గుడిసెలు ఖాళీ చేసి కోతిరాంపూర్ లో నివాసం ఉంటున్నారు.

ప్రతిరోజు ఉదయం కమాన్ ప్రాంతానికి వచ్చి కొలిమి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల గురించి పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ వాహనాలు నడిపే వారి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన కారు మీద ఇప్పటికే 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది పనులు చేసుకునేవారు ప్రాణాలు కోల్పోతున్నారు.