బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈమె మరో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈమె మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు బేబీ బంప్ తో ఉన్నట్లు ఫోటో కనిపించింది. దీంతో ఈ విషయం గురించి స్పందించింది కరీనా.
ప్రస్తుతం కరీనాకపూర్ తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉండగా.. ఆ వెకేషన్ కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేసుకుంది. అందులో తను అచ్చం ప్రెగ్నెంట్ లా ఉన్నట్టు కనిపించింది. అయితే అది ప్రెగ్నెంట్ కాదని.. అది కేవలం పాస్తా, వైన్ వల్లే అలా జరిగిందని తెలిపింది. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు.. నేను గర్భవతిని కాదు.. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశానని సైఫ్ చెప్పాడు అంటూ తెలిపింది. మొత్తానికి ఆమె ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ వచ్చింది.