Bollywood: మాములుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే అందం, అభినయం, టాలెంట్ తో పాటుగా ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అలాగే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత కూడా సినిమా ఇండస్ట్రీకి చక్కగా సరి పోతుందని చెప్పాలి. కెరిర్ బాగా ఉన్నప్పుడే వరుస అవకాశాలు అందుకోవాలి. పారితోషికం కూడా పెంచుతూ పోవాలి. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బుల్లి తెరపై, ఓటీటీ రంగంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకుని, కామెడీ షో లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు కపిల్ శర్మ. ఎప్పటి నుంచో కామెడీ షోలు చేస్తూ వస్తున్నారు.
మొదట్లో టీవీ ఛానల్స్ లో ఈయన షోలు వచ్చేవి. ఇప్పుడు ఓటీటీ లో ఈయన కామెడీ షోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి ఈయన ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ను రన్ చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి కామెడీ షోలు ఏడాదికి ఒక సీజన్ చొప్పున వస్తూ ఉంటాయి. కానీ షో కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండానే ఏడాది గ్యాప్ లోనే రెండు సీజన్ లను తీసుకు వచ్చారు. మూడో సీజన్ షూటింగ్ సైతం పూర్తి చేసి స్ట్రీమింగ్ కు రెడీ చేశారు. మూడో సీజన్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కోసం హోస్ట్‌గా కపిల్ శర్మ తీసుకునే పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్ కోసం కపిల్ శర్మ ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. మొదటి సీజన్ ను గత ఏడాది జూన్ లో స్ట్రీమింగ్ చేశారు. మొదటి సీజన్ లో మొత్తంగా 13 ఎపిసోడ్స్ ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అన్ని ఎపిసోడ్స్ కి మంచి స్పందన వచ్చింది. ఇక రెండో సీజన్ ను గత ఏడాది సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ చేశారు. ఇక సీజన్ 3 ను సైతం ఇప్పటికే మొదలు పెట్టారు. సీజన్ 3 మొదటి ఎపిసోడ్ లో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రావడంతో మంచి స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో మూడో సీజన్‌కి కపిల్ శర్మ ఎంత పారితోషికం అందుకుంటున్నాడు అనే చర్చ మొదలైంది. కాగా మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచి కపిల్ శర్మ ప్రతి ఎపిసోడ్ కి రూ.5 కోట్ల పారితోషికంను అందుకుంటున్నాడు. మొదటి సీజన్ లో 13 ఎపిసోడ్స్ కు గాను రూ.65 కోట్లు, రెండో సీజన్ 13 ఎపిసోడ్స్ కు గాను రూ.65 కోట్ల పారితోషికంను ఇప్పటికే అందుకున్నాడు. మొదటి రెండు సీజన్ లకు ఏకంగా రూ.130 కోట్ల పారితోషికంను అందుకున్నాడు. ఇక తాజా సీజన్ కు గాను ఆయన 13 ఎపిసోడ్స్ కి ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. దాంతో ఏడాదిలోనే కపిల్ శర్మ ఈ కామెడీ షో తో దాదాపు రూ.200 కోట్ల పారితోషికం ను అందుకుంటున్నాడట. ఈ విషయం తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.