ఏపీలో వైసీపీ పార్టీని ప్రస్తుతం ఢీకొట్టే వాళ్లు లేరు. పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటం, పార్టీలో సీనియర్ నేతలు ఉండటంతో పార్టీకి ప్రస్తుతం మంచిపేరే ఉంది. జాతీయ స్థాయిలో వైసీపీ పార్టీ పేరు వినిపిస్తోంది. సాధారణంగా ప్రతిపక్షాలు పార్టీ మీద, ప్రభుత్వం మీద బురద జల్లుతుంటాయి. అది కామన్.
కానీ.. ఈ విచిత్రం ఏంటో కానీ.. వైఎస్సార్సీపీ పార్టీకి సొంత పార్టీ నుంచే శత్రువులు తయారవుతున్నారు. వైసీపీ ఎంపీగా ఉండి వైసీపీపైనే గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారు రఘురామకృష్ణ రాజు. ఆయన చేస్తున్న పనులు ఏపీ సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయట.
అసలే ఎంపీ.. అని చెప్పి కొందరు వైసీపీ నేతలు కూడా రఘురామకృష్ణ రాజు విషయంలో సైలెంట్ గా ఉంటున్నారు. అయితే ఆయన దుందుడుగుతనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆయన ఏపీ సీఎం జగన్ పై, పార్టీ నేతలపై విరుచుకుపడుతూనే ఉన్నారు.
ఇప్పటికే ఎన్నోసార్లు మీడియాతో మాట్లాడి జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించిన రాజు.. తాజాగా మరో కామెంట్ చేశారు.
జగన్ ఢిల్లీ పర్యటన తన వ్యక్తిగతం. కానీ.. జగన్ ఢిల్లీకి వచ్చి హోంమంత్రి అమిత్ షాతో ఏపీకి నిధుల గురించి మాట్లాడారని తెలిసి నేనే ఆశ్చర్యానికి గురయ్యా. ఇక వైసీపీ నేతలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఏపీలో తెలుగునే భూస్థాపితం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నా రక్తం తాగింది. తాగిన నా రక్తాన్ని తిరిగి ఇస్తుందా? వైసీపీ నేతలు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. నాకు సెక్యూరిటీ తొలిగిస్తామంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎటువంటి ఆరోపణలు చేసినా.. ఏం చేసినా నా సెక్యూరిటీ పెరుగుతుంది తప్పితే తగ్గదు.. అంటూ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు.
నా బాగోతాన్ని బయటపెడతారట. కొందరు నేతలు వాగుతున్నారు. నేను కూడా వాళ్ల బాగోతాలను బయటపెట్టగలను కదా. ఆ విషయాన్ని ఎందుకు వాళ్లు మరిచిపోతున్నారు.. అంటూ ఆయన ధ్వజమెత్తారు.