Prabhas: కన్నప్ప సినిమాలో ప్రభాస్ పెళ్లి టాక్.. కడుపుబ్బా నవ్వుకున్నా ప్రేక్షకులు.. అక్కడ కూడా అదే తీరు!

Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమాలతో అలరిస్తున్నప్పటికీ అభిమానులు ఎదురుచూస్తున్న శుభవార్త మాత్రం పెళ్లి వార్తే అని చెప్పాలి. ప్రభాస్ ఎప్పుడు ఒక ఇంటి వాడు అవుతాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికి చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే.

పెళ్లి పేరు ఎత్తితే చాలు పారిపోతూ ఉంటారు. అందులో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు అని చెప్పవచ్చు. 45 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లి ఊసు ఎత్తడం లేదు.. అప్పుడెప్పుడో వచ్చిన బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని వార్తలు వినిపించినప్పటికీ బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి ఊసు ఎత్తడం లేదు. ఈ ఏడాదే ప్రభాస్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.

అయితే ఎవరెన్ని అనుకున్నా, వయసు మీద పడుతున్నా, సోషల్ మీడియాలో కొన్ని వందల ఆర్టికల్స్ వచ్చినా కూడా ప్రభాస్‌ మాత్రం పెళ్లంటేనే నాలుగడుగులు వెనకడుగు వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా లెక్క చేయడం లేదు. రియల్‌ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌ లో కూడా ఇదే జరిగింది. తాజాగా విడుదల అయిన కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్‌. ఒక సీన్‌లో తిన్నడు, రుద్ర(ప్రభాస్‌)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతాడు. అందుకు రుద్ర నా పెళ్లి గురించి నీకెందుకులే అని కౌంటర్ ఇచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్‌ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్‌ లో చప్పట్లు, విజిల్స్‌ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్‌ అభిమానుల అరుపులతో థియేటర్‌ దద్దరిల్లిపోతోంది. అంతేకాకుండా ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎత్తినప్పుడు రియల్ లైఫ్ లో మాదిరిగానే రియల్ లైఫ్ లో కూడా స్పందించడంతో అభిమానులు ఫుల్ గా కడుపుబ్బా నవ్వుకున్నారు.