నాతో స్నేహం చేయాలన్న అర్హత ఉండాలి… వారికి ఆ అర్హత లేదు: కంగనా

బాలీవుడ్ లేడీ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన కంగనా రౌనత్ తరుచు అన్ని విషయాలలో తలదూర్చి వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. తరచూ ఎవరో ఒకరి మీద విమర్శలు చేస్తూ వివాదాల్లో నిలిచే ఈ బ్యూటీ వరుస సినిమాలూ చేస్తూ బిజీగా ఉంటోంది. ప్రస్తుతం నటించిన ధాకడ్ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమదానం చెప్పింది. ఈ మేరకు యాంకర్ మాట్లాడుతూ.. ఆదివారం వేళలో మీ ఇంట్లో అతిథులుగా భోజనం చేసే అవకాశం వస్తే బాలీవుడ్ లో ఏ ముగ్గురికి ఆ అవకాశం ఇస్తారు అని ప్రశ్నించగా.. కంగానా మాట్లాడుతూ..తన ఇంటికి వచ్చి విందులో పాల్గొనే అర్హత బాలీవుడ్ సినీ రంగంలో ఎవరికీ లేదని చెప్పుకొచ్చింది. తర్వత మీకు బాలీవుడ్ లో ఎవరూ ఫ్రెండ్స్ లేరా అని యాంకర్ ప్రశ్నించగా.. లేరని సమధానం చెప్పింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తనతో స్నేహం చేయాలంటే కావాల్సిన అర్హత బాలీవుడ్లో ఏ ఒక్కరికీ లేదని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలలో ఏ ఒక్కరికీ కూడా తన ఇంట్లో అడుగుపెట్టే అర్హత కూడా లేదు అని ఆమె ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా కంగనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ధాకడ్ సినిమాలో కంగనా యాక్షన్ స్టార్ అలరించబోతున్నారు. ఈ సినిమ మే 20న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.