‘విక్రమ్’ ఫస్ట్ లుక్ కోసం సర్వం సిద్ధం

Kamal Hassan's Vikram first look will be out today evening

Kamal Hassan's Vikram first look will be out today evening

కమల్ హాసన్ సైన్ చేసిన కొత్త చిత్రం ‘విక్రమ్’.  ‘మాస్టర్’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు.  ఈ చిత్రం మీద దక్షిణాది ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.  ఆ అంచనాలకు తగ్గట్టే చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు లోకేష్ కనగరాజ్. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. ఇందులో ప్రధాన ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ చేస్తుండగా స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రభుదేవా సైతం ఇందులో నటిస్తున్నాడు.  ‘ఖైదీ, మాస్టర్’ లాంటి వరుస హిట్ల తర్వాత లోకేష్ కనగరాజ్ చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లోనే కాదు బిజినెస్ వర్గాల్లో కూడ సినిమా మీద మంచి హైప్ ఉంది.  

ఇప్పటికే సినిమా విడుదలైన చిన్నపాటి టీజర్ మంచి పేరు తెచ్చుకోగా ఫస్ట్ లుక్ రెడీ చేసి విడుదలకు సిద్ధమయ్యారు టీమ్.  దీన్ని ఈరోజు సాయంత్రం 5 గంటలకు రివీల్ చేయనున్నారు. ఇటీవల కాలంలో కమల్ హాసన్ చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. కమల్ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నందున ఈ పొలిటికల్ థ్రిల్లర్ మీద అందరిలోనూ అమితమైన ఆసక్తి నెలకొంది. కమల్ తన పొలిటికల్ వ్యూస్ ఈ సినిమాలో కనబరుస్తారని కొందరు అంటున్నారు.  ఇది కాకుండా కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ చేస్తున్నారు.  ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు.  అలాగే మలయాళం ‘దృశ్యం-2’ తమిళ రీమేక్ కూడ చేస్తున్నారు కమల్ హాసన్.