‘పోతురాజు’ను తలపిస్తున్న కమల్ హాసన్ ‘విక్రమ్’

Kamal Hassan'S Vikram First Look Is Replica Of Pothuraju
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘విక్రమ్’.  ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.   ఇటీవలే విడుదలైన సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.  సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి.  పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది.  కొద్దిసేపటి క్రితమే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు టీమ్.  ఇందులో కమల్ హాసన్ తో పాటు ప్రధాన పాత్రలు చేస్తున్న విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లుక్స్ కూడ ఉన్నాయి.  ముగ్గురి లుక్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి.  ముగ్గురు నటులు గుబురు గడ్డం, కోర మీసాలతో దర్శనమిచ్చారు.  
 
ఈ ముగ్గురు కూడ నటన పరంగా భేష్ అనిపించుకున్నవారే కావడంతో సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో ఉన్నారు.  ఒకే స్క్రీన్ మీద ముగ్గురు గొప్ప నటులు పోటీపడి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్.  ఒక ఈ పోస్టర్ గతంలో కమల్ హాసన్ చేసిన ‘పోతురాజు’ సినిమా పోస్టర్ ను పోలి ఉండటం ఇంకొక విశేషం.  కమల్ కెరీర్లో ‘పోతురాజు’ సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది.  చాలామంది దర్శకులు, సినీ ప్రియుల మీద గొప్పగా ప్రభావం చూపిన సినిమా ఇది.  ఫస్ట్ లుక్ చూశాక ఇప్పుడు వస్తున్న ‘విక్రమ్’ కూడ అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నారు అభిమానులు.  
 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles