నా కొడుకు వల్ల నాకు ఇబ్బంది అంటున్న కాజల్

సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ లు సాధారణంగా లేట్ గా పెళ్లి చేసుకుంటారు. అయితే పిల్లలు పుట్టాక మాత్రం చాలా మంది హీరోయిన్లు సినిమాలకు చాలా కాలం దూరంగా ఉంటారు. శ్రీదేవి, అమల, ఐశ్వర్య రాయి, నమ్రత లాంటి హీరోయిన్స్ పెళ్లి అయ్యి, పిల్లలు పుట్టాక సినిమాలకు దూరంగా ఉన్నారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే హీరోయిన్లు మళ్ళీ బిజీ అయిపోతున్నారు. రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ కి కూడా నో చెప్పడం లేదు. కరీనా కపూర్ పిల్లలు పుట్టాక కూడా రొమాంటిక్ సీన్స్ లో నటించింది.

రీసెంట్ గా పెళ్లి చేసుకుని, ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్, తాను పిల్లల్ని కానీ తొందరబడ్డానని వాపోతుంది. నేను ప్రెగ్నెన్సీ విష‌యంలో తొంద‌ర‌ప‌డ్డానేమో అనిపిస్తుంది. బాబు ఉండ‌టం వ‌ల్ల ఎక్క‌డికీ వెళ్ల‌లేక‌పోతున్నా.

నాకు ఇంత‌టి క్రేజ్ తీసుకు వ‌చ్చిన సినిమాల‌ను, ప్రేక్ష‌కుల‌ను దూరంగా ఉంచ‌డం క‌ష్టంగా ఉంది. ఒక‌వేళ బాబు లేక‌పోతే నేను ఇప్ప‌టికే మ‌ళ్లీ సినిమాల్లో బిజీగా ఉండేదాన్ని కాబోలు అంటూ మాట్లాడింది. అదేంటి త‌ల్లి కావ‌డం కంటే కూడా నీకు సినిమాలు ఎక్కువ‌య్యాయా అంటూ కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.