Kajal Aggarwal : శ్రీవారికి ప్రేమలేఖ: నెట్టింట్లో వైరల్ అవుతోన్న కాజల్ పోస్ట్

Kajal Aggarwal : ఈ మధ్య కాజల్ అగర్వాల్ స్టోరీ టెల్లర్‌గా మారిపోయింది. తన ఇన్‌స్టా వేదికగా మాతృత్వపు ముచ్చట్లను కథలు కథలుగా షేర్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ మాతృత్వానికి సంబంధించి తీసుకోవల్సిన జాగ్రత్తలూ, చేయాల్సిన ఎక్సర్‌సైజులూ, తీసుకోవల్సిన ఫుడ్ ఇలాంటి విషయాలను షేర్ చేస్తూ వచ్చింది.

అలాగే, కొన్ని మెటర్నిటీ ప్రాడక్టులను ప్రమోట్ చేయడంలోనూ కాజల్ ఆసక్తి చూపించింది. ఇక తాజాగా తన భర్త కిచ్లూ గురించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ అల్లుకొచ్చింది కాజల్ అగర్వాల్. కాబోయే తండ్రిగా తన భర్త కిచ్లూ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాడంటూ అందుకు పుట్టబోయే తన బిడ్డ చాలా చాలా అదృష్టవంతురాలు అని కాజల్ చెప్పింది.

ప్రెగ్నెంట్‌గా తన అనుభూతులన్నింటినీ, పక్కనే వుండి ఆయన కూడా అస్వాదిస్తున్నాడనీ, తనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాడనీ, తనకు నిద్ర రాకపోతే, ఆయన కూడా తనతో పాటే మేల్కొని వుంటున్నాడనీ అందుకు తాను చాలా చాలా అదృష్టవంతురాలినని కాజల్ తన భర్త గొప్పతనాన్ని అందంగా వివరించింది.

అంతేకాదు, పుట్టబోయే బిడ్డ రాకతో తమ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయనీ, ఇంతకు ముందులా లేట్ నైట్ పార్టీలూ, సినిమాలూ, షికార్లనూ ఎంజాయ్ చేయలేమనీ చెబుతూనే, అంతకు మించిన ఆనందాన్ని తమ బిడ్డ కారణంగా పొందుతామనీ ఆ అనుభూతిని పొందడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ కాజల్ చెప్పుకొచ్చింది.

తననూ పుట్టబోయే తన బిడ్డను ఎంతో ప్రేమగా సంరక్షిస్తున్న కిచ్లూ ఓ తండ్రిగా  ఎంతో అద్భుతమైన వ్యక్తి.. అంటూ కాజల్ అభివర్ణించింది.