ఈ ఏడు నెలలు కాజల్ అనుష్కను పట్టించుకోనేలేదు !

Kajal Aggarwal replies to Anushka after seven months
Kajal Aggarwal replies to Anushka after seven months
కాజల్ అగర్వాల్ అనుష్కను పట్టించుకోలేదు.  అది కూడ ఏడు నెలల.  కాజల్ అగర్వాల్ గతేడాది అక్టోబర్ నెలలో వివాహం చేసుకుంది.  తన పెళ్లి గురించి కాజల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.  సోషల్ మీడియాలో రెండు నెలలు తన పెళ్లి గురించి చర్చ జరిగేలా ప్లాన్ చేసింది.  భర్త గౌతమ్ కిచ్లు గురించి పలు సంగతులు చెబుతూ పెళ్లి తర్వాత తాము ఉండబోయే కొత్త ఇంటిని చూపించడం, హానీ మూన్ ఫోటోలను స్వయంగా రిలీజ్ చేయడం లాంటివి చేసి తన పెళ్లిని హాట్ టాపిక్ చేసింది. ఈ హడావుడిలో పడి తనకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పిన అనుష్కను పట్టించుకోవడం మర్చిపోయింది.  
 
కాజల్ పెళ్లి జరిగిన తర్వాత అనుష్క అక్టోబర్ 31న ట్విట్టర్ ద్వారా పెళ్లి శుభాకాంక్షలు చెప్పింది.  ఎప్పుడూ సోషల్ మీడియాలో స్తబ్దుగా ఉండే అనుష్క పనిగట్టుకుని పెద్ద పోస్ట్ పెట్టి కాజల్, గౌతమ్ జంటను విష్ చేసింది. అయితే ఆమె శుభాకాంక్షలను కాజల్ చూసుకోలేదు. అది కూడ ఏడు నెలలపాటు. ఎప్పుడో అక్టోబర్లో అనుష్క విషెస్ చెబితే నిన్న రిప్లై ఇచ్చింది. అది కూడ మూడు హార్ట్ సింబల్స్ పెట్టి. ఇది చూసిన నెటిజన్లు అనుష్కకు రిప్లయ్ ఇవ్వడానికి ఏడు నెలలు పట్టిందా కాజల్, ఈ ఏడు నెలల మీరు అసలు ట్విట్టరే వాడలేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.