Home News కాజల్ అగ‌ర్వాల్ అస‌హ్యించుకొనే వాళ్లెవ‌రో తెలుసా?

కాజల్ అగ‌ర్వాల్ అస‌హ్యించుకొనే వాళ్లెవ‌రో తెలుసా?

ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన కలువ క‌ళ్ల సుంద‌రి కాజ‌ల్ అగ‌ర్వాల్. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 15 ఏళ్ళ‌యిన‌ప్ప‌టికీ ఏ మాత్రం గ‌ర్వంతో ఉండ‌దు. ప్ర‌తి ఒక్క‌రిని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ ఉంటుంది. ఇటీవ‌ల త‌న చిన్ననాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం మాల్దీవుల‌కు హ‌నీమూన్ టూర్‌లో భాగంగా వెళ్ళిన కాజ‌ల్ అక్క‌డి అంద‌మైన ప్ర‌కృతిని త‌నివితీరా ఆస్వాదిస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

Kajal Aggarwal White Dress Stills

ఇక హ‌నీమూన్ ట్రిప్ త‌ర్వాత ఆచార్య సినిమా సెట్‌లో అడుగుపెట్టింది. త‌న భ‌ర్త‌ను తీసుకొని ఆచార్య సెట్‌కు వ‌చ్చి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం తీసుకుంది. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో పాటు ఇండియన్ 2, ప్రభుదేవాతో సినిమాలకు కూడా కమిట్ అయింది కాజల్. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కాజ‌ల్ అడ‌పాద‌డపా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేసింది.

త‌న‌కు రెండు ర‌కాల మ‌నుషులు న‌చ్చ‌ర‌ని చెప్పుకొచ్చిన కాజ‌ల్ .. అబ‌ద్దాలు ఆడేవాళ్లంటే ప‌ర‌మ అస‌హ్యం అని పేర్కొంది. మన అనుకున్న వాళ్ళు మ‌న ద‌గ్గ‌ర అబ‌ద్దాలు మాట్లాడితే కోప‌మొస్తుంది. ఎప్పుడెప్పుడు కొడ‌దామా అనిపిస్త‌ది. అలాంటి వాళ్ల‌ను అంత ఈజీగా క్ష‌మించ‌లేను నాతో అబ‌ద్ధాలు ఆడ‌డానికి చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. రెండోది మోసం చేసే వాళ్ళ‌న్నా కూడా నాకు చిరాకు. వారిని నా ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌ను. ఈ మ‌ధ్య నేను కొంత మారాను. అలాంటి వాళ్లు నాకు తార‌స ప‌డిన‌ప్పుడు కోపం ప్ర‌ద‌ర్శించ‌కుండా కాస్త కంట్రోల్ చేసుకుంటున్నాను అని చిల‌క‌ప‌లుకులు చెప్పుకొచ్చింది కాజ‌ల్.

- Advertisement -

Related Posts

అఖిలపక్షంతో వస్తాను..అపాయింట్‌మెంట్ ఇవ్వండి: మోదీకి జగన్ మరో లేఖ

ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు.. సోమవారం పార్లమెంట్ లో విశాఖ ఎంపీ సత్యన్నారయణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదంటూ కేంద్ర ఆర్థిక...

మంత్రి బుగ్గన సంచలన ప్రకటన: కర్నూలులో 250 ఎకరాల్లో హైకోర్టు!

కర్నూలులోని జగన్నాథగుట్ట ప్రాంతంలో 250 ఎకరాల్లో రాష్ట్ర హైకోర్టు నిర్మితమవుతుందనీ, జ్యుడీషియల్ క్యాపిటల్ ప్రక్రియ హైకోర్టు నుంచి సానుకూల తీర్పు వచ్చిన తర్వాత ప్రారంభమవుతుందనీ వైసీపీ ముఖ్య నేత, ఏపీ ఆర్థిక మంత్రి...

రెండో వివాహం చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య !

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు, అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ...

Latest News