Kajal Agarwal: స్టైలిష్ లుక్ లో కాజల్ అగర్వాల్… కాజల్ పోస్ట్ పై స్పందించిన సమంత!

Kajal Agarwal: వెండితెర చందమామగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గత దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ వివాహం చేసుకున్న తర్వాత కూడా పలు చిత్రాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి కావడంతో ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ తాజాగా వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఎక్కడ ఉన్నారో క్లారిటీ లేకపోయినప్పటికీ ఈమె షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హెడ్‌పై స్టయిలీష్‌ గ్లాసెస్‌, జీన్స్ షర్ట్, బ్లూ ప్యాంట్‌ ధరించి సోఫాలో ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలు కాజల్ ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ… రుతువులు మారిపోతున్నాయి.. వాటిలాగే నేను కూడా కొత్త ఆకులా మారిపోతున్నాను అంటూ బేబీ బంప్ తో ఉన్న ఎమోజిని షేర్ చేశారు.

ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో పై ఎంతో మంది అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోలో కాజల్ అగర్వాల్ కు ప్రెగ్నెన్సీ లక్షణాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇకపోతే కాజల్ షేర్ చేసిన ఈ ఫోటో పై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ క్రమంలోనే సమంత స్పందిస్తూ కాజల్ ఫోటోకి ప్రేమతో కూడిన ఎమోజీలను షేర్ చేయడంతో సమంత అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.