కువైట్ సెంట్రల్ జైలులో కడప జిల్లా వాసి ఆత్మహత్య

కువైట్ సెంట్రల్ జైలులో.. ఆర్దియ హత్యకేసుల నిందితుడు వెంకటేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్‌లో ముగ్గురిని హత్యచేసినట్లు వెంకటేష్‌ మీద ఆరోపణలు ఉన్నాయి.. దీంతో జైల్లో ఉంటూ.. న్యాయ విచారణను ఎదుర్కొంటున్నాడు. అతని ఆత్మహత్యకు గల కారణాలపై అధికారుల ఆరా తీస్తున్నారు. కాగా వెంకటేష్‌ స్వస్థలం కడప జిల్లా. బుధవారం రాత్రి మంచానికి ఉన్న వస్త్రంతో ఉరివేసుకొని చనిపోయినట్లు అధికారులు తెలిపారు.