ఎస్ఆర్కే ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 నూతన చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల దర్శకుడు కే విజయ్ భాస్కర్ కొంత విరామం తర్వాత మెగాఫోన్ పడుతున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ  ఎస్ఆర్కే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పిస్తున్నారు. శ్రీ కమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం లో శివాని రాజశేఖర్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

విజయ భాస్కర్‌ దర్శకత్వంలోవస్తున్న 13వ చిత్రమిది. విజయదశమి ని పురస్కరించుకొని ఈ చిత్ర ప్రారంభోత్సవం చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నిర్మాత స్రవంతి రవి కిషోర్ స్క్రిప్ట్ అందించగా డాక్టర్ రాజశేఖర్ కెమరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా,  తొలి సన్నివేశానికి బి గోపాల్ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, ఎం ఆర్ వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, గెటప్  శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నటీనటులు,  శ్రీ కమల్ (పరిచయం) శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ , మురళీ శర్మ, గెటప్  శ్రీను, మిర్చి కిరణ్ , గుండు సుదర్శన్ , బిత్తిరి సత్తి తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : విజయ భాస్కర్. కె
నిర్మాతలు: గుంటూరు రామకృష్ణ,  వెంకట శ్రీనివాస్ బొగ్గరం
సంగీతం : మణిశర్మ
డీవోపీ: సతీష్ ముత్యాల
ఆర్ట్ డైరెక్టర్: పి. సంపత్ రావు
ఎడిటర్: ఎం ఆర్ వర్మ
సహ దర్శకుడు : మండలి వి కలి
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
పీఆర్వో : వంశీ – శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంక సంతోషిణి
ప్రొడక్షన్ కంట్రోలర్: పాలటి శ్రీనివాసరావు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: చరణ్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : నన్నపనేని రవీంద్రబాబు
అసోసియేట్ డైరెక్టర్లు: బొగ్గరపు అభినవ్ , వెంకట సురేంద్ర ముప్పరాజు
అసిస్టెంట్ డైరెక్టర్ : గజ్జెల నాగరాజు
మేకప్: తోట గోపి
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే