దర్శకుడు విజయభాస్కర్‌ రంగప్రవేశం.. కొడుకు శ్రీకమల్‌ హీరోగా ‘ఉషాపరిణయం’

టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు కే. విజయ్‌ భాస్కర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘జై చిరంజీవ’ లాంటి ఆల్‌టైమ్‌ ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్‌లను టాలీవుడ్‌కు అందించాడు. ఇక చాలారోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయ్‌ భాస్కర్‌ తన కొడుకు కోసం మళ్ళీ మెగాఫోన్‌ పట్టాడు.

ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ’ఉషాపరిణయం’ లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో విజయ్‌ భాస్కర్‌ కొడుకు శ్రీకమల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే మూవీకి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ వదిలింది.

ఇక ఈ టీజర్‌ గమనిస్తే.. విజయ్‌ భాస్కర్‌ చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఓ సరికొత్త ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీకమల్‌తో పాటు తాన్వీ ఆకాంక్ష, సూర్య, అలీ, వెన్నెలకిషోర్‌, శివాజీరాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా విజయ్‌ భాస్కర్‌ చేపడుతున్నారు.