సలార్’లో జ్యోతిక.. ప్రభాస్ అక్కగా

Jyothika to act as Prabhas' sister
Jyothika to act as Prabhas' sister
ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘సలార్’ ఒకటి.  ‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మితమవుతోంది.  ఎంతోమంది దర్శకులు లైన్లో ఉన్నా అందరినీ ఆపి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు.  ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ అనగానే ఇండియా లెవల్లో సినిమా మీద హైప్ క్రియేట్ అయింది.  ఈ చిత్రంలో కాస్టింగ్ కూడ భారీగానే ఉంటోంది.  ఇందులో ప్రభాస్ సోదరిగా జ్యోతిక నటిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన జ్యోతిక ఈమధ్య సినిమాలు బాగా తగ్గించారు.  పెద్ద హీరోల సినిమాల్లో ఎన్ని అవకాశాలు వచ్చినా తిరస్కరించారు. విజయ్ చేసిన ‘మెర్సల్’ సినిమాలో నిత్యా మీనన్ చేసిన పాత్ర మొదట జ్యోతిక వద్దకే వెళ్ళింది. కానీ ఆమె నో చెప్పారు. కేవలం ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారామె. అలాంటి జ్యోతిక ప్రభాస్ సోదరిగా నటించడానికి సుముఖంగానే ఉన్నారట.  ఇదే గనుక జరిగితే ‘సలార్’ సినిమాలో జ్యోతిక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.