Bhumika: మాట్లాడే ప్రతి పదం జాగ్రత్తగా మాట్లాడాలి… అభిమానులకు సూచించిన నటి భూమిక!

Bhumika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఒకానొక సమయంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకప్పుడు తెలుగు తమిళ మలయాళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు దక్కించుకుంది.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన భూమిక కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఈ క్రమంలోనే నాని నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

ఈ విధంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భూమిక ప్రస్తుతం ఎన్నో సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న భూమిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలన్నీ అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఈ విధంగా ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన అభిమానులకు కొన్ని విషయాల గురించి హితబోధ చేశారు.మనం ఎవరి గురించి అయినా లేదా మన గురించి అయినా మాట్లాడేటప్పుడు ప్రతి పదం కూడా మంచిగా ఉండాలి.ఆ పదాలు ఇతరుల కోసం ఉపయోగించిన మీ కోసం అయినా మీరు అన్నది కచ్చితంగా జరుగుతాయి కనుక మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ ఈ సందర్భంగా భూమిక తెలియజేశారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.