Y.S.Jagan: జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికలలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకొని ఆయనకు 151 స్థానాలలో విజయం కల్పించారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఆయనకు ఓట్లు వేసి 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది అయితే ఈ ఏడాది కాలంలోనే కూటమికి కూడా వ్యతిరేకత వచ్చిందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం అంటూ కొంతమంది వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే కూటమి ఏడాది పాలన పై అలాగే వైసిపి పై ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏంటి అనే విషయంపై సర్వే నిర్వహించారు అయితే ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకునేవారు సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది.
ఇటీవల నిర్వహించిన రెండు కీలక సర్వేల్లో జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. అయితే.. ఈ ప్రశ్నకు ప్రజల నుంచి 28 శాతం మార్కులు మాత్రమే పడ్డాయి. అంటే.. 28 శాతం మంది మాత్రమే ఆయనను సీఎంగా కోరుకుంటున్నారు. ఇది చాలా కష్టం. 2019తో పోల్చుకుంటే దాదాపు సగం వరకు జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకోవడం లేదంటూ సర్వేలో వెళ్లడైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్క నాయకుడు పార్టీ నేతలను కార్యకర్తలను ఉద్దేశించి చెబుతారు. అయితే ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏమాత్రం పుంజుకోలేదని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతుంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జగన్ రాజకీయాలకే ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.