టీడీపీలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రకంపనల వెనుక.!

తెలుగుదేశం పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఓ ‘ఏక్ నాథ్ షిండే’ కాబోతున్నాడా.? ఔననే చర్చ తెలుగునాట రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల, జూనియర్ ఎన్టీయార్‌తో భేటీ అయ్యాక.. ‘జూనియర్ ఎన్టీయార్ టీడీపీని కైవసం చేసుకోబోతున్నాడు..’ అంటూ ఒకప్పటి జూనియర్ ఎన్టీయార్ సన్నిహితుడు, వైసీపీ నేత కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.

కొడాలి నాని ఏదో అన్నారని కాదుగానీ, జూనియర్ ఎన్టీయార్ విషయమై చంద్రబాబుకి చాలా చాలా అనుమానాలున్నాయి. అందుకే, 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీయార్‌ని ప్రచారం కోసం పిలిపించుకున్నా, ఆ వెంటనే ఆయన్ని దూరం పెట్టేశారు టీడీపీ అధినేత.

గత కొంతకాలంగా, టీడీపీలో జూనియర్ ఎన్టీయార్ మద్దతుదారులు స్వరం పెంచుతోంటే, వర్ల రామయ్య లాంటి ద్వారా టీడీపీలోని జూనియర్ ఎన్టీయార్ మీద విమర్శలు చేయిస్తున్నారు చంద్రబాబు. అయినాగానీ, చంద్రబాబు పర్యటనల్లో తరచూ ‘జై ఎన్టీయార్’ నినాదాలు చేస్తున్నారు నందమూరి అభిమానులు. వారిని సైతం నందమూరి బాలకృష్ణ ద్వారా కంట్రోల్‌లో చంద్రబాబు పెట్టుకోగలుగుతున్నారు.

కానీ, ఎన్నాళ్ళిలా.? అందుకే, పరిస్థితుల్ని పూర్తిగా విశ్లేషించిన బీజేపీ అధినాయకత్వం, యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాల్లో వుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా, తెరవెనుక కాస్త సహాయ సహకారాలు అందిస్తే చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్టీయార్‌ని కోరారని తెలుస్తోంది.

ఒకవేళ యంగ్ టైగర్ ఎన్టీయార్ గనుక ‘సై’ అంటే, రాత్రికి రాత్రి ఈక్వేషన్స్ మారిపోతాయి. పురంధరీశ్వరి, సుజనా చౌదరి లాంటివారి ద్వారా టీడీపీని రాత్రికి రాత్రి గల్లంతు చేయించేయడం బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద కష్టమేమీ కాదు. గల్లంతయిపోవడమంటే, చంద్రబాబు నుంచి మాయమైపోయి.. పురంధరీశ్వరి చేతుల్లోకి వచ్చేయడమన్నమాట.