బాలయ్య సినిమాపై జూ. ఎన్టీఆర్ రివ్యూ వైరల్.!

నందమూరి అభిమానులు ఎంతో కాలం నుంచి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “అఖండ” నిన్న విడుదల అయ్యి భారీ రెస్పాన్స్ ను అందుకొని సర్వత్రా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇండస్ట్రీ నుంచి కూడా బాలయ్య మరియు బోయపాటిల హ్యాట్రిక్ సక్సెస్ కి బ్రహ్మరథం పడుతున్నారు.

మరి ఈ లిస్ట్ లో నందమూరి వారి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరడంతో నందమూరి అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మరి ఈ సినిమా చూసాక జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన రివ్యూ వైరల్ గా మారింది. “ఇప్పుడే అఖండ చూడటం ఫినిష్ చేశాను.

బాల బాబాయ్ మరియు టోటల్ టీం రీసౌండింగ్ సక్సెస్ కి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. సినిమాలో హార్డ్ కోర్ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి” అంటూ తన మార్క్ రివ్యూ ని తారక్ చెప్పడంతో వారి అభిమానుల్లో కొత్త ఊపు వచ్చింది మరి.