JR Ntr shocking comments : ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తాము హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఒక్క రోజులోనే ఎన్నో ఇంటర్వూస్ ఇస్తూ చేస్తూ ఈ హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా బిజీ బిజీగా ఉన్నాడు.
అయితే ఈ ముగ్గురిపై ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఒకటి చిత్ర నిర్మాతలు లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇది రికార్డు అవుతుందని తెలియకుండా ఆఫ్ ది రికార్డు లో చేసిన ఇంటర్వ్యూ ఇది. రాజమోళి మరియు రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ లు కెమెరా ముందు కాకుండా రియల్ లైఫ్ లో ఎలా మాట్లాడుకుంటారో ఇందులో సారాంశం.
అయితే ఇందులో ఎన్టీఆర్ చేసిన ఓ షాకింగ్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రామ్ చరణ్ కాఫీ పెట్టి ఇవ్వనా అని ఎన్టీఆర్ ని అడుగుతాడు. అప్పుడు నీ చేత్తో విషం పెట్టి ఇచ్చినా తాగేస్తా అని అంటాడు. దీనితో ఈ మాట ఓ రేంజ్ లో వైరల్ గా మారింది.
అంతే కాకుండా వీరిద్దరి స్నేహం ఈ స్థాయిలో ఉందా అని అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ ఇంటర్వ్యూ లో మరిన్ని విశేషాలు ఉన్నాయి. చూడాలి అనుకునేవారు యూట్యూబ్ డీవీవీ ప్రొడక్షన్ ఛానెల్లో చూడొచ్చు.