Gallery

Home News జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీలో నో ఛాన్స్.? క్లారిటీ ఇచ్చేసిన బాలకృష్ణ?

జూనియర్ ఎన్టీయార్‌కి టీడీపీలో నో ఛాన్స్.? క్లారిటీ ఇచ్చేసిన బాలకృష్ణ?

Balayya'S 'Close Door' Comment

2008 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ నందమూరి తారకరామారావు, ఆ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డా కూడా, కదల్లేని స్థితిలో మంచం మీద నుంచే లైవ్ ప్రసారాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. టీడీపీ గెలుపు కోసం తనవంతుగా ప్రయత్నించాడు. అయినా, టీడీపీ అధికారంలోకి రాలేకపోయిందనుకోండి.. అది వేరే సంగతి. కానీ, యంగ్ టైగర్ పడ్డ కష్టం గురించి ఇప్పటికీ అంతా చర్చించుకుంటారు. అచ్చం తాతయ్యలా మారిపోయి, యంగ్ టైగర్ చేసిన ప్రసంగాలు స్వర్గీయ నందమూరి తారకరామారావునే గుర్తు చేశాయి చాలామందికి. ఇక, అసలు విషయంలోకి వస్తే, జూనియర్ ఎన్టీయార్‌కి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు అవకాశమే లేదన్నట్టున్నాయి నందమూరి బాలకృష్ణ తాజా వ్యాఖ్యలు.

సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్బంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్ రాజకీయం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావనపై స్పందించిన బాలయ్య, జూనియర్ ఎన్టీయార్ వల్ల టీడీపీకి ప్లస్సయ్యి.. మైనస్ అయితేనో.? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీయార్ పేరు పెట్టుకున్నంతమాత్రాన ఆయనలా రాజకీయాల్లో రాణించెయ్యలేరన్నట్టుగానూ బాలయ్య వ్యాఖ్యలున్నాయి. దాంతో, యంగ్ టైగర్ అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యారు. బాలయ్య మీద ట్రోలింగ్ మొదలు పెట్టారు. అయితే, బాలయ్య వ్యాఖ్యల్లో విపరీతార్థాలు ఏమీ లేవనీ, సినిమాల్లో బిజీగా వున్న ఎన్టీయార్ మీద రాజకీయ ఒత్తిడి తగ్గించడానికే ఆయన అలా వ్యాఖ్యానించారంటూ టీడీపీ మద్దతుదారులు వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ, ఎన్టీయార్ విషయమై టీడీపీలో ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు గత కొంతకాలంగా నడుస్తూనే వున్నాయి. రాజకీయంగా ఎన్టీయార్ ఎదగకుండా చేసేందుకోసమే ఈ ప్రయత్నాలన్నవి ఆయన అభిమానుల ఆవేదన. ఒక్కటి మాత్రం నిజం.. ఎన్టీయార్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీలోనూ చాలామంది కోరుకుంటున్నారు. అదే టీడీపీ అధిష్టానానికి నచ్చడంలేదు. కానీ, యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు. ఆయన సినిమా కెరీర్ పరంగా చాలా బిజీగా వున్నారిప్పుడు.

- Advertisement -

Related Posts

Sonu Sood: ఐఫోన్ అడిగిన నెటిజన్..! దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనూసూద్

Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన...

Biscuit Packet: రిమోట్ కారు ఆర్డరిస్తే.. బిస్కట్ ప్యాకెట్ వచ్చింది..! కస్టమర్ ఏం చేశాడంటే..

Biscuit Packet: ప్రస్తుతం అంతా ఆన్ లైన్ యుగం. టిఫిన్, భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, ఇంట్లో టీవీ, వంటింట్లో ఫ్రిజ్, బాత్ రూమ్ లో గ్రీజర్, బెడ్ రూమ్ లో మంచం, హాల్లో...

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం.. పార్టీల మధ్యనా.? ప్రభుత్వాల మధ్యనా.?

ఆంధ్రపదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం ఇంకోసారి భగ్గుమంది. రాజకీయ నాయకులు మాట మీద అదుపు కోల్పోతున్నారు. తెలంగాణ నుంచే దూకుడుగా అనవసరపు మాటలు వస్తున్నాయి. ఆంధ్రపదేశ్ నుంచి కాస్త సంయమనమే...

Latest News