Home News కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీయార్: చంద్రబాబుకి షాకిస్తోన్న జెండాలు.!

కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీయార్: చంద్రబాబుకి షాకిస్తోన్న జెండాలు.!

Jr Ntr Next Cm, Irritating Flags In Cbn'S Tour

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి కొత్త కష్టమొచ్చింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులైన టీడీపీ కార్యకర్తలు తమ ఇల్ళ మీద జూనియర్ ఎన్టీయార్ అలాగే హరికృష్ణ ఫొటోలతో కూడిన జెండాల్నిపెట్టుకోవడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపిన విషయం విదితమే. టీడీపీ జెండా అయిన పసుపు జెండా కాకుండా, తెల్ల జెండాలు దర్శనమిచ్చాయి. మళ్ళీ అదే సీన్, కృష్ణా జిల్లాలో చంద్రబాబుకి రిపీట్ అవుతోంది.

కృష్ణా జిల్లాలో పార్టీకి చెందిన ముఖ్య నేతల్ని పరామర్శించేందుకు వెళ్ళిన చంద్రబాబుకి టీడీపీ జెండాలతోపాటు ఈ తెల్ల జెండాలు.. అవేనండీ యంగ్ టైగర్ ఎన్టీయార్ జెండాలు కూడా స్వాగతం పలికాయి. ‘కాబోయే సీఎం యంగ్ టైగర్ ఎన్టీయార్..’ అనే నినాదాలు వాటిపై రాసి వున్నాయి.. యంగ్ టైగర్ ఫొటోలతో సహా. కొన్ని జెండాలైతే, జై ఎన్టీయార్.. జై టీడీపీ.. అంటూ యంగ్ టైగర్ ఫొటోలను కలిగి వుండడం గమనార్హం.

ఈ జెండాల్ని ఎవరెవరు తెస్తున్నారు.? అన్నదానిపై పార్టీ శ్రేణులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోపక్క, యంగ్ టైగర్ ఎన్టీయార్ మాత్రం రాజకీయాల పట్ల అంత ఆసక్తి చూపించడంలేదు. సినిమాలతోపాటుగా, బుల్లితెరపై ఓ గేమ్ షోతో బిజీగా వున్నాడిప్పుడు యంగ్ టైగర్. అలాగని, రాజకీయాలపై పూర్తిగా ఆసక్తి లేదా.? అంటే, వుండే వుంటుంది.. కానీ, అందుకు ఇది తగిన సమయం కాదని అనుకుంటున్నాడాయన.

అయితే, నిప్పు లేకుండా పొగ రాదు కదా.? యంగ్ టైగర్ ఎన్టీయార్ అనుమతి లేకుండానే ఆయన జెండాలు, చంద్రబాబు పర్యటనల్లో హల్ చల్ చేస్తున్నాయని అనుకోగలమా.? ఏమోగానీ, చంద్రబాబుకి ముందు ముందు యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలిలేలా వుందన్నది మాత్రం నిర్వివాదాంశం. వీలైనంత త్వరగా ఈ విషయమై యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో చంద్రబాబు చర్చించి, యంగ్ టైగర్ అభిమానుల్ని శాంతింపజేసే చర్యలు చేపట్టకపోతే అంతే సంగతులు.

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News