ఆ ఒక్కటీ చేయగలిగితే లోకేష్‌ను పక్కపెట్టి జూనియర్‌‌‌కే టీడీపీ పగ్గాలు ??

టీడీపీలో రెండు వర్గాలుంటాయి.. ఒకటి పక్తు టీడీపీ వర్గం కాగా రెండవది నందమూరి అభిమానగణం.  టీడీపీ వర్గం చంద్రబాబు నాయకత్వాన్నే కోరుకుంటుంటారు.  నందమూరి అభిమానులు మాత్రం పార్టీ ఎప్పటికైనా నందమూరి వారసుల చేతిలోకి వెళితే చూడాలని ఆశగా ఉంటారు.  అలాగని వీరు పార్టీలో తిరుగుబాటు చేయరు.  అలా చేస్తే అది టీడీపీని దెబ్బతీస్తుంది.  ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి తమ మూలంగా అలాంటి నష్టం జరగకూడదని మౌనంగా చంద్రబాబు నాయకత్వాన్ని మీద వెసుకుని మోస్తుంటారు.  బాలకృష్ణ మీద ఎలాగూ ఆశలు వదిలేసుకున్న వీరు హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ మీదే గురిపెట్టుకుని కూర్చున్నారు.  

Jr NTR need to execute this plan to get TDP into his hands 

పార్టీని చంద్రబాబు నుండి తన చేతుల్లోకి తీసుకోగల స్టామినా జూనియర్‌‌‌కు మాత్రమే ఉందని వీరంతా బలంగా నమ్ముతున్నారు.  అందుకే ఇన్నాళ్లు సరైన సిట్యుయేషన్ కోసం ఎదురుచూసిన వీరంతా ఇప్పుడు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు.  టీడీపీలో యువ నాయకత్వం లోటు స్పష్టంగా తెలుస్తోంది.  ఓటర్లను ఆకర్షించగల యంగ్ లీడర్స్ పెద్దగా లేరు.  ఇక బలవంతంగా పార్టీ మీద, జనం మీద రుద్దబడిన చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.  దీంతో టీడీపీ క్యాడర్ లోకేష్ విషయంలో నిరుత్సాహంగా ఉన్నారు.  

బాబు గనుక పార్టీని లోకేష్ చేతిలో పెట్టి పార్టీ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.  అందుకే జూనియర్ త్వరపడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలాని కోరుతున్నారు.  కానీ నేరుగా వచ్చి పార్టీలో చేరితే బాబుగారు చేర్చుకుంటారా, చేర్చుకున్నా లోకేష్‌ను మించి ఎదగనిస్తారా.  అది జరగదు కాబట్టి స్వయంగా చంద్రబాబే పిలిచి పార్టీని అప్పగించాలంటే ఒక్కటే మార్గం అంటున్నారు.  అదే వేరు కుంపటి.  జూనియర్‌‌‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  నందమూరి అభిమానుల అండ ఎలాగూ ఉంది.  కాబట్టి ఆయన టీడీపీకి ప్రత్యామ్నాయం అనేలా కొత్త పార్టీని పెడితే టీడీపీ క్యాడర్ తప్పకుండా చీలిపోతుంది.  


పార్టీలోని సగం మంది నేతలు ఆయన వైపు వెళ్ళిపోతారు.  ఇక కమ్మ సామాజిక వర్గం కూడ చీలుతుంది.  ఇది అంతిమంగా టీడీపీని కోలుకోలేని దెబ్బ కొడుతుంది.  ఇవన్నీ ఆపడానికి బాబు వేరే దారి లేక జూనియర్‌‌‌ను పిలిచి మరీ పార్టీలో చేర్చుకుంటారు.  ఒకసారి ఎంటరయ్యాక డామినేషన్ ఎలాగూ మొదలైపోతుంది కాబట్టి కొన్నాళ్లకు ఎన్టీఆరే పార్టీకి పెద్ద దిక్కు అవుతారని మనసులో మాట చెబుతున్నారు.  మరి తారక్ వారి మాటలను ఆలకిస్తారో లేదో చూడాలి.