ఒక హీరో రాజమౌళితో సినిమా చేస్తున్నాడు అంటే ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తించే విషయం. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ విషయంలో కూడ ఇదే చర్చ నడుస్తోంది. రామ్ చరణ్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తాడనే క్లారిటీ ఉంది. సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండబోతోందని, అందులో చరణ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు అనేది కూడ చూచాయిగా అభిమానులకు తెలుసు. ఎటొచ్చీ తారక్ సినిమా విషయంలోనే టోటల్ కన్ఫ్యూజన్ నెలకొని ఉంది.
మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనతో ప్రాజెక్ట్ లేదని అంటున్నారు. ఇప్పుడేమో కొరటాల శివ తెర మీదకు వచ్చారు. ‘ఆచార్య’ ముగియగానే కొరటాల ఎన్టీఆర్ సినిమా పనులు స్టార్ట్ చేస్తారని, ‘పుష్ప’ షూటింగ్ ఆలస్యం అయ్యేలా ఉండటంతో ఆయన తారక్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని అంటున్నారు. అయితే ఏ విషయంలోనూ పూర్తి క్లారిటీ లేదు. దీంతో అభిమానులు కూడ ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎవరితో సినిమా అనేది తెలిస్తే అంచనాలు కూడ దానికి తగ్గట్టే ఉంటాయి కదా, ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఎన్నాళ్ళు అంటున్నారు.