Ntr: మీ ప్రేమ నాకు చాలా విలువైనది… అభిమానులపై ప్రేమ కురిపించిన ఎన్టీఆర్.. పోస్ట్ వైరల్!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా భాగమైన విషయం తెలిసిందే.

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించి వార్‌ 2 టీజర్‌ని విడుదల చేశారు.

ప్రస్తుతం ఈ టీజర్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. ఇలా ఈ టీజర్ కు విశేష స్పందన రావడంతో ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.వార్‌ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్‌ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్‌ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్‌. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి పొంగిపోయాను.

టీజర్ ఇంతటి ప్రభావాన్ని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఆగస్టు 14వ తేదీ థియేటర్లలో మిమ్మల్ని మరింత సందడి చేయబోతున్నాము అంటూ ఎన్టీఆర్ టీజర్ పట్ల ప్రేక్షకులు చూపిస్తున్నటువంటి ఆదరణ పై స్పందిస్తూ ప్రేక్షకుల ప్రేమ ఎంతో విలువైనది అంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.