టీడీపీ పండుగ మహానాడు సందర్భంగా జరిగిన రెండు రోజుల కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు ఉన్నప్పటికీ ముఖ్య నేతలంతా హాజరైన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ నుంచి హాజరు కావాల్సిన వాళ్లు ఢుమా కొట్టినా..చంద్రబాబు అనుకూలంగా ఉన్నవారితో ఈసారి మహానాడు ముగిసింది. ఆ వేదిక సాక్షిగా నేతల మధ్య ఓ ఆసక్తికర విషయం చర్చకొచ్చిందిట. గతంలో చంద్రబాబు భుజాల మీదకి ఎక్కించుకున్న నాయకులంతా ఇప్పుడే చేస్తున్నారన్నది చర్చ సారంశమట. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి చేరి జగన్ కి వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే.
జగన్ ని వెన్నుపోటు పొడిచిన ఫలితం – వాళ్లందరికీ మంచి మంత్రి పదవులు కూడా దక్కాయి. అప్పటికే పార్టీలో సీనియర్లను సైతం పక్కనబెట్టి చంద్రబాబు వాళ్లందరికీ పదవులుకట్టబెట్టారు. దూలిపాళ్ల నరేంద్ర, బుచ్చయ్య వంటి వారిని వెనక్కి నెట్టి అమరనాథ్ రెడ్డి, పితాని వంటి వారికి పట్టం గట్టారు. మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. ఆ తదపరి ఎన్నికల్లో వీళ్లంతా అదే పార్టీ నుంచి పోటీ చేసి జగన్ సునామీలో కొట్టుకుపోయారనుకోండి. ఆ తర్వాత వాళ్లెవరు బయట పెద్దగా కనిపించలేదు. మహానాడులో ప్రధానంగా ముఖ్యనేతలంతా ఈ విషయంపై చర్చకు దారి తీసారట. పార్టీ భవిష్యత్ బాగున్నప్పుడు కనిపించిన నేతలు ఇప్పుడు పార్టీ దిగజారిపోతున్న స్టేజ్ లో ఉన్నప్పుడు కనిపించలేదంటని? మాట మంతి ఆడుకున్నారుట.
ఇక మహిళా నాయకురాళ్లు అయితే తుపాకీ వేసిన దొరకడం లేదని అనుకున్నారుట. ఈ మాటల మధ్యలోనే ఓ సీనియర్ మాజీ మంత్రి మన బంగారం మంచిదైతే కదా? అనుకోవడానికి! ఇక్కడ అందరూ రాజకీయ దొంగలే..ఈరోజుల్లో నిజాయితీగల రాజకీయం ఎక్కడుందంటూ జోకేసుడుట. దీంతో ఆ 24 మంది వల్ల పదవులు కోల్పోయిన వారంతా పక పకా నవ్వుకున్నారని సమాచారం. ఆ సమయంలో చంద్రబాబు సరిగ్గా ఐదారు మీటర్లు దూరంలో ఉన్నారుట. ఈ సన్నివేశాన్ని చంద్రబాబు చూసి చూడటనట్లు వదిలేసినట్లు పార్టీ వర్గాల నుంచి తెలిసింది. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేయగలరు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు ఫ్యాన్ కిందకు చేరడానికి సిద్దమవుతున్నారు. ఇప్పుడేమైనా అంటే మొదటికే ముప్పు కదా.