అబ్బబ్బబ్బ.. ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఇంతలా వేచి చూడలేదు. ఒక్క యూఎస్ మాత్రమే కాదు..యావత్ ప్రపంచం వేచి చూసింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారా అని. ఎన్నికలు అయిపోయినా.. లెక్కింపును వాయిదా వేయడం.. ట్రంప్ మధ్యలో ఇరకాటాలు పెట్టడం.. ఇలా కౌంటింగ్ మధ్యలో ఎన్నో టెన్షన్ లు నడిచాయి. చివరకు ఉత్కంఠ వీడిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ పీఠం బైడెన్ కే దక్కింది.
డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కు 290 ఓట్లు లభించడంతో ఆయన ఎన్నిక లాంఛనం అయింది. మొత్తం యూఎస్ లో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. దాంట్లో ట్రంప్ కు వచ్చింది 214 మాత్రమే. అమెరికా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలంటే 270 ఓట్లు రావాలి. కానీ.. జో బైడెన్ కు 20 ఓట్లు ఎక్కువే వచ్చాయి.
అయితే.. పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల ఫలితాలు చివరగా వెలువడటంతో అధ్యక్ష పీఠం ఎవరిదో తెలిసిపోయింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ గా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జో బైడెన్ కు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు మద్దతు తెలిపారు. దీంతో 77 ఏళ్ల వయసులో జో బైడెల్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్నారు.