G.V.Reddy: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన రాజీనామా తర్వాత మొదటిసారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆయన ప్రశంసిస్తూ, తక్కువ రెవెన్యూ లోటుతో భారీ బడ్జెట్‌ను రూపొందించడాన్ని అభినందించారు.
కేవలం రూ.33,000 కోట్ల రెవెన్యూ లోటుతోనే రూ.3.2 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్థంగా ప్రవేశపెట్టారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన జీవి రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేశారు అయితే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అంటే నాకు ఎప్పుడు గౌరవమేనని తెలిపారు.
పార్టీలో ఉన్న సమయంలో ఆయనకు దక్కిన గౌరవాన్ని గుర్తుచేసుకుంటూ, చంద్రబాబు నాయకత్వాన్ని ఎప్పటికీ మెచ్చుకుంటానని పేర్కొన్నారు. దీంతో ఆయన పార్టీకి తిరిగి చేరనున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈయన చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే మాత్రం పార్టీలో చేరుతారు అనడానికి ఇదే నిదర్శనం అని తెలుస్తుంది.
నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్‌ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు.
నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల…
— G V Reddy (@gvreddy0406) March 1, 2025
ఇలా చంద్రబాబు గురించి ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా 2029 ఎన్నికలలో కూడా మాసారే ముఖ్యమంత్రిగా గెలుస్తారు అంటూ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఈయన పోస్ట్ చేయడంతో తప్పనిసరిగా ఈయన తిరిగి పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి అంటూ పలువురు భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేతలు, తిరిగి టీడీపీ వైపు ఆకర్షితమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ప్రభావం కొనసాగుతుందనడానికి జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా మారాయని చెప్పాలి.