జేడి చక్రవర్తి ఒక భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు, నిర్మాత, స్వరకర్త, గాయకుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగులోనే కాక హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా చాలా ప్రసిద్ధి పొందాడు. జేడీ చక్రవర్తి 12వ IFFI లో ప్రదర్శింపబడిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ బ్లాక్ బస్టర్ శివ అనే తెలుగు చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
తర్వాత శివ చిత్రం రీమేక్ తో బాలీవుడ్ లో ప్రవేశించాడు. ఇలా వరుస అవకాశాలతో ముందుకు దూసుకెళ్తూ దర్శక నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఎన్నో సినిమాలలో పని చేయడం జరిగింది. హీరోగా నటిస్తూ మంచి మంచి బ్లాక్ బాస్టర్ సినిమాలను అకౌంట్లో వేసుకున్నాడు. అనేక అవార్డులను పొందిన జేడీ చక్రవర్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు సినిమా అవకాశాలపై, సినిమా ప్లాప్ లపై స్పందన ఏంటి అని ప్రశ్న ఎదురైంది.
అందుకు జేడీ చక్రవర్తి సినిమా చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తరువాత సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందా లేదా ప్లాఫ్ అవుతుందా అనేది మన చేతులలో ఉండదు. ఎవరైనా సినిమా చేసేటప్పుడు విజయం సాధించాలని సినిమా చేస్తారు అని పేర్కొనడం జరిగింది. సినిమా విజయం సాధిస్తే అవకాశాలు పెరుగుతాయి, సినిమా ఫ్లాప్ అయితే కాస్త అవకాశాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది.
ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో తనపై రంభ చేసిన కామెంట్స్ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు జెడి చక్రవర్తి తనకు చాలా తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారని అందులో రంభ ఒకరు అని పేర్కొనడం జరిగింది. రంభ వివాహానికి తాను హాజరు కాకపోవడంతో తనపై కాస్త కోపంగా ఉందని అందుకే అలా స్పందించిందని పేర్కొనడం జరిగింది. తమ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని తెలిపాడు.