నిప్పును నిప్పు..పప్పును పప్పు అని నిజాయితీగా ఒప్పుకోవడం మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి స్టైల్. ఆయన పార్టీ టీడీపీ అయినా జగన్ పై విమర్శలు చేస్తూనే అప్పుడప్పుడు ప్రశంసలు కురిపిస్తారు. జగన్ పాలన విషయంలో మొండిగా వెళ్తాడని, అతను ఎవరి మాట వినడని, మంచోడని చెప్పిన సందర్భాలు కోకొల్లలు. వైఎస్సార్ ఫ్యామీలితో ఉన్న రిలేషన్ కారణంగా అలా చెప్పారా? లేక ఆఫ్యామిలీ నిజాయితీ గురించి బాగా తెలిసిన వాడిగా అలా మాట్టాడుతారా? అన్నది పక్కనబెడితే! తాజాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో జగన్ దూకుడుని జేసీ ప్రశంసించారు. ప్రాజెక్ట్ నిర్ణయాన్ని ఆయన సమర్ధించారు.
ఆ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ రతనాల సీమ అవుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అండో కోఈ విషయంపై మాట్లాడటానికి ముందుకు రాకపోయినా జేసీ ఏకపక్షంగా తన నిర్ణయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పారు. నిజాయితీని దాచాల్సిన విషయం కాదు..నలుగురికి చెప్పాల్సిన విషయమని ప్రతిపక్షమైతే ఏంటి..అధికార పక్షమైతే ఏంటి? మంచి ఎవరు చేసినా పొగిడి తీరాల్సిన సన్నివేశామని టీడీపీ కి చురకలు అంటించారు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో టీడీపీ చేస్తోన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఇంట్లో ఉండి దీక్షలు చేస్తే? జగన్ స్పందిస్తారా? అని ప్రశ్నించారు.
టీడీపీ నాయకులు దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకర్ధం కాలేదన్నారు. గతంలో అమరావతి రాజధాని కోసం చాలా మంది తిండి తిప్పలు మానేసి రోడ్డెక్కారు. రోడ్లపై వంటా వార్పులు చేసారు. అప్పుడు పట్టించుకోని జగన్ ఇప్పుడు ఇంట్లో ఉండి ఓదార్పు దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు. అప్పుడప్పుడు కొంచెం వాడండి అంటూ తన దైన శైలిలో సొంత పార్టీ నేతల్ని విమర్శించారు. దీంతో టీడీపీలో మంట పుట్టినట్లు అయింది. సొంత పార్టీ నాయకుడే ఇలా రివర్స్ అయితే ఎలా? మన పార్టీ పరిస్థితి ఏంటని నేతల్లో చర్చకు దారితీస్తోందిట. కొంత మంది టీడీపీ నేతలు జేసీపై గుసాయిస్తున్నారుట.